AP Private Schools: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రైవేటు స్కూళ్లలో 25 శాతం అడ్మిషన్లు ఫ్రీగా ఇవ్వాలంటూ గత ప్రభుత్వం జారీ చేసిన జీవోను హైకోర్టు (High Court) కొట్టివేసింది. ఈ జీవోను వ్యతిరేకిస్తూ హైకోర్టును ఆశ్రయించిన ప్రైవేటు పాఠశాలలు.. 25 శాతం అడ్మిషన్లు ఉచితంగా ఇవ్వలేంటూ పిటిషన్ దాఖలు చేశాయి. అయితే ఈ పిటిషన్‌పై హైకోర్టులో పలుమార్లు విచారణ జరిగగా.. ఇరువర్గాల వాదనలను విన్న న్యాయస్థానం సోమవారం తుది తీర్పు వెల్లడించింది. అన్ని ప్రైవేటు స్కూళ్లలో 25 శాతం ఉచితంగా అడ్మిషన్లు ఇవ్వాలని జారీ చేసిన ప్రభుత్వం జీవోను హైకోర్టు కొట్టివేసింది. ఇది ప్రభుత్వ తొందరపాటు చర్య అని పేర్కొంది. విద్యాహక్కు చట్టంలో ఉన్న ప్రొసీజర్లను ఆ శాఖ కచ్చితంగా అమలు చేయాలని స్పష్టం చేసింది.
Also Read: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఆ శాఖలో 17 వేలకు పైగా ఉద్యోగాలు