/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/surabhi-jpg.webp)
Surabhi : చావు నుంచి రెప్పపాటులో తప్పించుకున్నాను అంటోంది టాలీవుడ్ హీరోయిన్(Tollywood Heroine) సురభి(Surabhi). ఆమె చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో నటిగా మంచి పేరు తెచ్చుకున్న సురభి... తెలుగు చిత్ర సీమ(Film Industry) కు బీరువా అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.
ఆ తరువాత ధనుష్ వీఐపీ సినిమాలో లీడ్ రోల్ లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత ఎక్స్‌ప్రెస్ రాజా, ఎటాక్, జెంటిల్మాన్ లాంటి సినిమాలతో వరుస అవకాశాలు అందిపుచ్చుకుంది. ఈమె చివరిగా అల్లు శిరీష్ తో కలిసి ఒక్క క్షణం సినిమాలో కనిపించింది. ఆ తరువాత ఇతర భాషల్లో సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.
తాజాగా ఈ అమ్మడు ఓ పెద్ద ప్రమాదం(Flight Accident) నుంచి బయటపడ్డాను అంటూ సోషల్ మీడియా(Social Media) లో ఓ పోస్ట్ పెట్టింది. అందులో నేను విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో విమానంలో సాంకేతిక లోపం తలెత్తి విమానం పైలెట్ కంట్రోల్ లో లేకుండా పోయింది. ఆ సమయంలో నాకు చాలా భయమేసింది. అప్పుడు పైలెట్ తీసుకున్న తెలివైన నిర్ణయంతో చావు అంచుల నుంచి వెనక్కి వచ్చినట్లు అనిపించింది అంటూ రాసుకొచ్చింది. ఇప్పటికీ ఆ ఘటన తలచుకుంటేనే భయంతో కాళ్లు చేతులు వణికిపోతున్నాయని సురభి పేర్కొంది.
నేను ఈరోజు బతికున్నందుకు ఓ కారణం నాలో ఉన్న ఓ పాజిటివ్ థికింగ్(Positive Thinking) కూడా అనిపిస్తుంది. అయితే సురభి ఈ ప్రయాణం ఎక్కడ నుంచి ఎక్కడి వరకు అనేది మాత్రం తెలియజేయలేదు.
Also Read : రక్తహీనతతో బాధపడుతున్న వారు.. ఆహారంలో వీటిని చేర్చుకుంటే హిమోగ్లోబిన్ పెరుగుతుంది!