Samantha: నా జీవితం ఇంతే...ఇలా అయిపోందేమిటి అనుకోవద్దు

వరుసగా రెండు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి, ఒకటి యావరేజ్ గా నిలిచింది. అయినా కూడా సమంత ఫేమ్ ఏ మాత్రం తగ్గలేదు. ప్రస్తుతం సినిమాలకు బ్రేక్ ఇచ్చిన సామ్ తన ఫ్యాన్స్ తో మాత్రం టచ్ లోనే ఉంటోంది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే సమంత తాజాగా అభిమానులతో వీడియో చాట్ చేసింది. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలను చెప్పింది.

New Update
Samantha: నా జీవితం ఇంతే...ఇలా అయిపోందేమిటి అనుకోవద్దు

Samantha Ruth Prabhu: ప్రస్తుతం సమంత అమెరికాలో ఉంది. అక్కడ మయోసైటిస్ కు చికిత్స తీసుకుంటోంది. దాంతో పాటూ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ తిరిగేస్తోంది. ఖుషీ సినిమా తర్వాత సమంత సినిమాలకు బ్రేక్ నిచ్చింది. ప్రస్తుతానికి ఒక ఏడాది అని చెప్పింది. కానీ సోషల్ మీడియా ద్వారా తన అభిమానులకు మాత్రం చేరుగానే ఉంటోంది సామ్. ఎప్పటికప్పుడు తన అప్డేట్స్ పెడుతూ వాళ్ళతో తన వ్యక్తిగత విషయాలతో సహా అన్నీ పంచుకుంటోంది.

తాజా మరోసారి ఆమె ఇన్ స్టాగ్రామ్ ద్వారా లైవ్ (Instagram Live) లోకి వచ్చారు. అభిమానులతో ముచ్చటించారు. ఇందులో భాగంగా అభిమానులు అడిగే వాటికి సమాధానాలు చెప్పింది. అభిమానులకి వినాయకచవితి విషెష్ చెప్పిన సమంత తన నెక్స్ట్ టూర్ ఆస్ట్రియా అని చెప్పుకొచ్చింది. సినిమాల గురించి ఓ అభిమాని అడగ్గా, ఇప్పట్లో సినిమా ఉండదని, ప్రస్తుతానికి ఎలాంటి కమిట్మెంట్స్ పెట్టుకోలేదని సమంత క్లారిటీ ఇచ్చారు. ఇక మీదట నుంచి కథల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటానని చెప్పుకొచ్చింది. తనకు నప్పే సినిమాలు మాత్రమే చేస్తానని అంది. నా కంఫర్ట్ జోన్ దాటి సినిమాలు చేయాలి..చూద్దాం ఏం జరుగుతుందో అంటోంది సామ్. దీని తరువాత యాక్షన్ సినిమాలు చేస్తారా అని ఫ్యాన్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా...నాకు యాక్షన్ మూవీస్ అంటే ఇష్టమే..సిటాడెల్ లో కొంచెం అలాంటి పాత్రే చేసానని చెప్పింది.

ఇక ఓ అభిమాని తన స్కిన్ టోన్ గురించి అడగగా వీడియో ఫిల్టర్ లో ఉందని, ప్రస్తుతం తన స్కిన్ బాగోలేదని, స్టెరాయిడ్స్ ఎక్కువగా తీసుకోవడం వలన స్కిన్ టోన్ పూర్తిగా పాడైపోయిందని చెప్పుకొచ్చింది. అలాగే మీ జీవితానికి సంబంధించిన మూడు అంశాలను చెప్పండి అని అడగ్గా... నేను ఏదైనా సాధిస్తాను, ఎలాంటి పరిస్థితి అయినా స్వీకరిస్తాను, నీతి, నిజాయితీలో ముందుకు సాగుతా అని చెప్పింది సామ్.

చివరగా నేటి యువతకు మీరిచ్చే సలహా ఏంటి అని ఓ నెటిజన్ అడిగిన ప్రశ్న కు సమాధానంగా సమంత ఇలా చెప్పుకొచ్చొంది. చిన్న చిన్న వాటికే నా జీవితం ఇలా అయిపోయింది అనుకోవద్దు. ఇప్పుడే మీ జీవితం మొదలైంది. జీవిత ప్రయాణంలో ఎన్నో కష్టాలు ఎదురవుతాయి. వాటిన ధైర్యంగా ఎదర్కోవాలి. కొన్ని సార్లు అవే మనల్ని రాటు దేలుస్తాయి. ఏదీ మనకు ముందుగానే తెలియదు. దేన్నైనా సానుకూల దృక్పథం తీసుకుని ముందు సాగడం అలవాటు చేసుకోవాలని చెప్పింది సమంత.

Also Read: చంద్రబాబునే అరెస్ట్ చేస్తే మాలాంటి సామాన్యుడి పరిస్థితి ఏంటి..?

Advertisment
తాజా కథనాలు