Train : అర్థరాత్రి ట్రాక్ పై ట్రక్ బోల్తా.. ప్రాణాలు అడ్డుపెట్టి కొన్ని వందల ప్రాణాలు కాపాడిన వృద్ద దంపతులు!

చెన్నై- భగవతీపురం రైల్వే స్టేషన్ సమీపంలో ఘాట్ రోడ్డు నుండి ప్లైవుడ్ లోడ్‌తో వెళ్తున్న ట్రక్ అదుపుతప్పి రైల్వే ట్రాక్‌పై పడిపోయింది.ప్రమాదాన్ని గమనించిన వృద్ధ దంపతులు అర్థరాత్రి రైల్వే ట్రాక్‌పై పరిగెత్తి వేగంగా వస్తున్న ఎక్స్‌ప్రెస్ రైలును ఆపేసి భారీ ప్రమాదం నుండి కాపాడారు

New Update
Train : అర్థరాత్రి ట్రాక్ పై ట్రక్ బోల్తా.. ప్రాణాలు అడ్డుపెట్టి కొన్ని వందల ప్రాణాలు కాపాడిన వృద్ద దంపతులు!

Mid Night : అర్థరాత్రి పూట(Mid Night) రైలు పట్టాల మీద పెద్ద ట్రక్(Truck) పడిపోవడం.. అదే సమయంలో ఓ ఎక్స్ప్రెస్ రైలు(Express Train)  అటుగా రావడం గమనించిన ఓ వృద్ద జంట తమ ప్రాణాలను పణంగా పెట్టి మరీ రకరకాల సిగ్నల్స్ ఇస్తూ రైలుని ఆపేలా చేశారు. దీంతో కొన్ని వందల ప్రాణాలను కాపాడిన ఘనత వారికి దక్కింది. వారికి ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుతున్నాయి.

అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. కేరళ(Kerala) నుంచి ప్లైవుడ్‌తో ట్రక్కు తమిళనాడులోని(Tamilanadu) తూత్తుకుడి వెళ్తోంది. తమిళనాడు, కేరళ సరిహద్దు సమీపంలోని ఎస్ వేలవు ప్రాంతానికి చేరుకోగానే డ్రైవర్ అకస్మాత్తుగా ట్రక్కు నియంత్రణ కోల్పోయాడు. దీంతో ట్రాక్‌పై ట్రక్కు బోల్తా పడింది. ఆ సమయంలో పులియరై ప్రాంతానికి చెందిన షణ్ముగయ్య(Shanmugayya), అతని భార్య కురుంతమ్మాళ్(Kurunthammal)  అనే దంపతులు ఈ ప్రమాదాన్ని చూశారు.

ఆ సమయంలో పట్టాల మీద ఓ ఎక్స్ప్రెస్‌ రైలు వెళ్తుందని వారికి తెలుసు. దీంతో వారిద్దరూ తమ తెలివిని ప్రదర్శించి, టార్చ్‌ లైట్లను రైలుకు చూపడం మొదలు పెట్టారు. వాటిని గమనించిన ఎక్స్ప్రెస్ రైలు డ్రైవర్లు వెంటనే రైలును నిలుపుదల చేశారు. దీంతో పెద్ద రైలు ప్రమాదం తప్పింది. చాలా ఎత్తు నుంచి ట్రక్కు పట్టాలపై పడడంతో తుక్కుతుక్కు అయిపోయింది.

లారీ డ్రైవర్ మణికందన్ (34) అక్కడికక్కడే మృతి చెందాడు. అతన్ని ముక్కుడల్ ప్రాంతానికి చెందిన వాడుగా అధికారులు గుర్తించారు. ప్రమాదం సమయంలో, ట్రక్కు క్లీనర్ కూడా కిందకు దూకి అతని ప్రాణాలను కాపాడుకున్నాడు. అనంతరం పులియరై వాహన చెక్‌పోస్టు వద్దకు వెళ్లి ఘటనపై పులియారై పోలీసులకు, తెన్‌కాసి రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని తెన్కాసి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

దెబ్బతిన్న ట్రక్కును ట్రాక్ నుండి తొలగించారు. ఈ సమయంలో సెంగోట్టై నుంచి పాలక్కాడ్‌కు వచ్చే రైళ్లు, చెన్నై నుంచి కొల్లాం వెళ్లే రైళ్లు నిలిచిపోయాయి.పెను ప్రమాదాన్ని తప్పించిన వృద్ద దంపతులపై ప్రశంసల జల్లు కురుస్తుంది.

Also Read : ఆ ఆనందాన్ని ఆస్వాదించలేకపోయాను అంటున్న రష్మిక

Advertisment
Advertisment
తాజా కథనాలు