Vishwak Sen: 'లైలా' గా విశ్వక్ సేన్.. కొత్త సినిమా టైటిల్ వచ్చేసింది

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ పుట్టినరోజు సందర్భంగా ఆయన నెక్స్ట్ మూవీ టైటిల్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ చిత్రానికి లైలా అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. షైన్ స్క్రీన్ నిర్మాణంలో రామ్ నారాయణ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇందులో విశ్వక్ లేడీ గెటప్ లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.

Vishwak Sen: 'లైలా'  గా విశ్వక్ సేన్.. కొత్త సినిమా టైటిల్ వచ్చేసింది
New Update

Vishwak Sen LAILA Movie: రీసెంట్ గామీ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన యంగ్ హీరో విశ్వక్ ప్రస్తుత గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీతో బిజీగా ఉన్నారు. కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ చివరి దశకు వచ్చేసింది. నేహా శెట్టి కథానాయికగా నటించగా.. నటి అంజలి కీలక పాత్రలో పోషిస్తుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్ , సాంగ్స్ తో మంచి బజ్ క్రియేట్ చేసిన ఈ మూవీ సమ్మర్ రిలీజ్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. గోదావరి బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్ టన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు.

Also Read: Ram Charan: గోవిందుడు అందరివాడలే.. ఓ అమ్మాయి కోసం రాంచరణ్‌ ఏం చేశాడో చెప్పిన మంచు మనోజ్‌!

publive-image

లైలా గా విశ్వక్ సేన్

ఇది ఇలా ఉంటే తాజాగా విశ్వక్ సేన్ పుట్టిన రోజు ఆయన నెక్స్ట్ సినిమా టైటిల్ ను అనౌన్స్ చేశారు మేకర్స్. లైలా అనే టైటిల్ ను ఖరారు చేశారు. షైన్ స్క్రీన్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ చిత్రానికి రామ్ నారాయణ్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ సినిమాలో విశ్వక్ లేడీ గెటప్ లో 'లైలా'గా కనిపించనున్నట్లు తెలుస్తోంది.

Also Read: Ariyana Glory: అరియానా గ్లోరీ సూసైడ్ వీడియో.. షాక్‌లో నెటిజన్లు!

#laila-movie #vishwak-sen-latest-movie #vishwak-sen
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe