Hero Vishal: హీరో విశాల్ తీరుపై హై కోర్ట్ ఆగ్రహం..! హీరో విశాల్ పై జడ్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. లైకా ప్రొడక్షన్ కేసులో.. తాను తెల్ల కాగితంపై సంతకం చేశానని. అగ్రిమెంట్ జరిగిందనే విషయం తనకు తెలియదని విచారణలో వాదించారు. దీంతో జడ్జీ తెలివిగా సమాధానం చెప్పారనుకుంటున్నారా..? ఇదేమి షూటింగ్ కాదు. సరిగ్గా బదులివ్వండి అని ఆదేశించారు. By Archana 02 Aug 2024 in సినిమా టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Hero Vishal : హీరో విశాల్ (Vishal) , కోలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్ మధ్య కొన్నాళ్ళ క్రితం డబ్బుల విషయంలో విభేదాలు తలెత్తాయి. విశాల్ తమకు ఇవ్వాల్సిన డబ్బు తిరిగి ఇవ్వలేదని లైకా సంస్థ (Lyca Production) మద్రాస్ హైకోర్టును ఆశ్రయించగా... ఈ కేసు విచారణలో భాగంగా విశాల్ కోర్టుకు హాజరయ్యారు. విచారణలో లైకా సంస్థతో ఒప్పందం గురించి ప్రశ్నించగా ... హీరో విశాల్ తాను ఖాళీ పేపర్ పై సంతకం చేశానని. లైకా సంస్థతో అగ్రిమెంట్ జరిగిందనే విషయం తనకు తెలియదని వాదించారు. దీంతో జడ్జీ ఆగ్రహించారు. ఖాళీ పేపర్ పై ఎలా సంతకం చేస్తారు..? తెలివిగా సమాధానం చెప్పానని అనుకుంటున్నారా..? ఇది షూటింగ్ కాదు.. సరిగ్గా చెప్పండి అని హెచ్చరించారు. దీంతో తాను తానూ లైకా సంస్థ దగ్గర డబ్బు అప్పుగా తీసుకున్నట్లు అంగీకరించారు. ఇక ఈ కేసును మళ్ళీ శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్లు న్యాయమూర్తి తెలిపారు. Also Read: Priyadarshi : లెక్కల మాస్టారుగా మారిన ప్రియదర్శి.. ‘35′ సెకండ్స్ గ్లింప్స్ #hero-vishal #lyca-productions మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి