Priyadarshi : లెక్కల మాస్టారుగా మారిన ప్రియదర్శి.. ‘35' సెకండ్స్ గ్లింప్స్‌

ప్రియదర్శి, నివేత థామస్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘35- చిన్న కథ కాదు’. రానా దగ్గుబాటి సమర్పణలో నందకిశోర్‌ ఈమని ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా మూవీ గ్లింప్స్‌ రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో ప్రియదర్శి లుక్, స్కూల్ సీన్స్ ఆసక్తిగా కనిపించాయి.

New Update
Priyadarshi : లెక్కల మాస్టారుగా మారిన ప్రియదర్శి.. ‘35' సెకండ్స్ గ్లింప్స్‌

Priyadarshi As A Maths Teacher : బలగం సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న పాపులర్ కమెడియన్ ప్రియదర్శి (Priyadarshi).. ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ బిజీగా సాగుతున్నారు. ఇటీవలే 'డార్లింగ్' సినిమాతో అలరించిన ప్రియదర్శి ‘35- చిన్న కథ కాదు’ అనే మూవీతో మరో సారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తాజాగా ఈ మూవీ గ్లింప్స్‌ రిలీజ్ చేశారు మేకర్స్.

‘35- చిన్న కథ కాదు’ గ్లింప్స్‌

తాజాగా విడుదలైన గ్లింప్స్‌ స్కూల్ సన్నివేశాలతో ఆసక్తిగా కనిపించింది. ఇందులో ప్రియదర్శి లెక్కల మాస్టర్ ఎం.చాణక్యవర్మగా డిఫరెంట్ పాత్రలో కనిపించబోతున్నారు. ప్రియదర్శి లుక్, స్కూల్ జరిగే సన్నివేశాలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. గ్లింప్స్‌ చూస్తుంటే లెక్కల మాస్టారుగా ప్రియదర్శి పాత్ర ఆసక్తికరంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.  నందకిశోర్‌ ఈమని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నివేత థామస్‌, విశ్వదేవ్‌, గౌతమి, భాగ్యరాజ్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. రానా దగ్గుబాటి (Rana Daggubati) సమర్పణలో సృజన్‌ యరబోలు, సిద్ధార్థ్‌ రాళ్లపల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Also Read: Ram Charan- Upasana: క్లీంకార కేర్ టేకర్ మాటలు వింటే చెర్రీని మెచ్చుకోకుండా ఉండలేరు 🥰.. ఏం అన్నారంటే? - Rtvlive.com

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు