బిచ్చగాడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయిన విజయ్ ఆంటోని కుమార్తె సూసైడ్ చేసుకున్నారు. విజయ్ ఆంటోని పెద్ద కూతురు మీరా ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.16 ఏళ్ల మీరా చెన్నైలోని ఓ ప్రముఖ ప్రైవేట్ పాఠశాలలో 12వ తరగతి చదువుతోంది. చెన్నైలోని డిడికె రోడ్‌లోని తన ఇంట్లో తెల్లవారుజామున 3 గంటలకు ఆమె ఉరివేసుకుని మరణించింది.మీరా ఆత్మహత్యకు పాల్పడిన విషయాన్ని గమనించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించినట్లు సమాచారం. కొన్ని రోజులుగా ఆమె ఒత్తిడిలో ఉన్నారని కూడా చెబుతున్నారు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు మీరా మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మీరా ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
విజయ్ ఆంటోని ఎన్నో సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ గా సంగీతం అందించారు. సింగర్ గానూ రాణించారు. బిచ్చగాడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. అంతకుముందు కూడా తెలుగులో ఎన్నో సినిమాలు వచ్చాయి. తాజాగా బిచ్చగాడు 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు విజయ్ ఆంటోని. విజయ్, ఫాతిమాను వివాహం చేసుకోగా వీరికి ఇద్దరు కూతుర్లు ఉన్నారు. అందులో పెద్ద కూతురు మీరా ఆత్మహత్య చేసుకోవడంతో విజయ్ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగింది.