Telangana: తెలంగాణ సీఎంకు సారీ చెప్పిన నటుడు సిద్ధార్థ్

హీరో సిద్ధార్థ్ మొత్తానికి దిగొచ్చాడు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మీద చేసిన కామెంట్లకు సారీ చెప్పాడు. తాను అన్న మాటలు వ్యతిరేకంగా వెళ్ళాయి అని...తనకు సీఎం రేవంత్ రెడ్డి మీద చాలా గౌరవం ఉందని చెప్పుకొచ్చాడు. యాంటీ డ్రగ్స్‌కు తన సపోర్ట్ ఎప్పుడూ ఉంటుందని చెప్పాడు.

New Update
Telangana: తెలంగాణ సీఎంకు సారీ చెప్పిన నటుడు సిద్ధార్థ్

Hero Siddharth: కమల్ హాసన్, సిద్ధార్ధ్ నటించిన భారతీయుడు-2 జూలై 12 రిలీజ అవుతోంది. దీనికి సంంబంధించిన ప్రమోషన్స్‌లో నటులు అందూ పాల్గొంటున్నారు. అయితే ఇందులో భాగంగా రీసెంట్‌గా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల గురించి మీడియా కమల్ హాసన్, సిద్దార్థ్ లని ప్రశ్నించారు. టికెట్ ధరలు పెంచుకోవాలంటే ప్రతి నటుడు డ్రగ్స్ కి వ్యతిరేకంగా 2 నిమిషాల వీడియో చేసి పంపాలని అలాంటి వాళ్ళ సినిమాకి మాత్రమే టికెట్ ధరలు పెంచుకునే వెసులుబాటు కల్పిస్తాం అని అన్నారు దానికి మీరఏమంటారని అడిగారు. దీనికి సమాధానం చెబుతూ సిద్దార్థ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఎన్నో తెలుగు చిత్రాల్లో నటించానని.. మొట్ట మొదట హైదరాబాద్ లో కండోమ్ వాడమని చేతులో కండోమ్ పెట్టుకుని హోర్డింగ్స్ కి ఫోజు ఇచ్చిన నటుడిని తానేనని చెప్పారు. ఒక నటుడిగా ఆ భాద్యత నాకు ఉంది. అవసరం అయినప్పుడు మేము మా బాధ్యత చాటుకుంటామని అన్నారు. అంతటితో ఊరుకోకుండా దానిని మరి కొంచెం పెంచుతూ కానీ ఇది చేస్తేనే మీకు ఇది దక్కుతుంది అని సీఎం మాట్లాడడం కరెక్ట్ కాదు అని సిద్దార్థ్ సంచలన వ్యాఖ్యలకి చేశారు. ఇవి కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అడిగిన దానికి సిద్ధార్ధ్ ఇలా రియాక్ట్ అవడం కరెక్ట్ కాదని నెటిజన్లు కామెంట్లు పెట్టారు.

దీంతో హీరో సిద్ధార్ధ్ క్షమాపణలు చెబుతూ వీడియో పెట్టారు. తన మాటల వెనుక ఉద్దేశం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని విమర్శించడం కాదని...తన మాటలని తప్పుగా అర్ధం చేసుకున్నారని చెప్పాడు. యాంటీ కరప్షన్, యంటీ డ్రగ్స్‌కు తాము ఎప్పుడూ సపోర్ట్ చేస్తామని తెలిపారు.

మరోవైపు తెలంగాణ సీఎం రేవంత్ అడిగిట్టుగా భారతీయుడు-2లో నటులు అందరూ కలిసి డ్రగ్స్‌కు వ్యతిరేకంగా వీడియో పెట్టారు. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండలంటూ పిలుపునిచ్చారు.

Advertisment
తాజా కథనాలు