Ravi Teja: ‘RT75’ మూవీ షూటింగ్ లో గాయపడిన రవితేజ నిన్న ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. కుడి చేతికి గాయం పెద్దగా కావడంతో చికిత్స కోసం యశోద ఆసుపత్రికి తీసుకెళ్లారు. అనంతరం ఆయన చేతికి చిన్న సర్జరీ నిర్వహించిన వైద్యులు.. ఆరు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. కాగా, సర్జరీ అనంతరం హీరో రవితేజ ఈరోజు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ విషయాన్ని రవితేజ సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.” సాఫీగా సాగిన సర్జరీ తర్వాత ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాను. ప్రస్తుతం నేను ఆరోగ్యంగా ఉన్నాను. నా క్షేమాన్ని ఆశిస్తూ సందేశాలు పంపిన వారందరికీ ధన్యవాదాలు. త్వరలోనే సెట్స్ పై తిరిగి అడుగుపెట్టేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను అని ట్వీట్ చేశారు. ”
పూర్తిగా చదవండి..Raviteja: హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన రవితేజ
హీరో రవితేజ కుడి చేతికి సర్జరీ అనంతరం హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ రవితేజ ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు. "ప్రస్తుతం తాను ఆరోగ్యంగా ఉన్నానని. తన క్షేమాన్ని ఆకాంక్షిస్తూ సందేశాలు పంపిన వారందరికీ ధన్యవాదాలు అని తెలిపారు."
Translate this News: