Prabhas : ప్రభాస్ జీవితంలోకి స్పెషల్ పర్సన్.. ఇది పెళ్లి కబురేనా?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇన్‌స్టా స్టోరీ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తర్వలో స్పెషల్ వ్యక్తి మన జీవితంలోకి రాబోతున్నారంటూ ప్రభాస్ పోస్ట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. దీంతో తన పెళ్లి గురించి హింట్ ఇచ్చారంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

New Update
Prabhas : ప్రభాస్ జీవితంలోకి స్పెషల్ పర్సన్.. ఇది పెళ్లి కబురేనా?

Special Person : పాన్ ఇండియా స్టార్(PAN INDIA STAR), టాలీవుడ్(Tollywood) రెబల్ స్టార్ ప్రభాస్ పెళ్లి(Prabhas Marriage) మళ్లీ తెరపైకి వచ్చింది. తాజాగా, ప్రభాస్ షేర్ చేసిన ఇన్‌స్టా స్టోరీ(Instagram Story) సోషల్ మీడియా(Social Media) లో వైరల్ గా మారింది. డార్లింగ్స్.. తర్వలోనే స్పెషల్ పర్సన్ మన జీవితంలోకి రాబోతున్నారు.. వెయిట్ చేయండి అంటూ ప్రభాస్ పోస్ట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. దీంతో ప్రభాస్ తన పెళ్లి గురించి హింట్ ఇచ్చారంటూ ఫ్యాన్స్ తెగ సంతోషపడుతున్నారు.

Also Read: మెగా ఫ్యామిలీలో చిచ్చు.. అల్లు అర్మీ దెబ్బ .. ట్విట్టర్ డియాక్టివేట్ చేసిన నాగబాబు..!

ప్రస్తుతం ప్రభాస్‌కు 44 ఏళ్లు. ఈ హీరో పెళ్లి కోసం అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. గతంలో కాజల్ అగర్వాల్, అనుష్క శెట్టిని ప్రభాస్ పెళ్లి చేసుకుంటాడని వార్తలు వినిపించాయి. రీసెంట్‌గా కృతిసనన్‌ తో లవ్‌లో ఉన్నాడని టాక్ కుడా వినిపించింది.

తిరుపతిలోనే పెళ్లి..

ఆదిపురుష్ ప్రీ-రిలీజ్ వేడుకలో తన పెళ్లికి సంబంధించి స్పందించాడు హీరో ప్రభాస్. ఫంక్షన్ లో ప్రభాస్ మైక్ అందుకోగానే.. ఫ్యాన్స్..పెళ్లి..పెళ్లి అంటూ పెద్ద ఎత్తున కేకలు పెట్టారు. దీంతో ప్రభాస్ మాట్లాడుతూ.. తను పెళ్లి చేసుకుంటే కచ్చితంగా తిరుపతిలోనే చేసుకుంటానని ప్రకటించాడు.

#tollywood #prabhas #Prabhas Marriage #pan-india-star-prabhas
Advertisment
తాజా కథనాలు