Aishwarya Arjun: తమిళ హీరోతో అర్జున్ కుమార్తె ఐశ్వర్య వివాహం.. వైరలవుతున్న ఫొటోలు

హీరో అర్జున్ కుమార్తె ఐశ్వర్య, తమిళ హీరో ఉమాపతి రామయ్య వివాహబంధంతో ఒక్కటయ్యారు. చెన్నైలోని గెరుగంబాక్కమ్‌లో అర్జున్ కట్టించిన హనుమాన్‌ ఆలయంలో వీరి వివాహ వేడుకలు ఘనంగా జరిగాయి. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరలవుతున్నాయి.

New Update
Aishwarya Arjun: తమిళ హీరోతో అర్జున్ కుమార్తె ఐశ్వర్య వివాహం.. వైరలవుతున్న ఫొటోలు

Aishwarya Arjun: టాలీవుడ్ సీనియర్ నటుడు అర్జున్ ఇంట పెళ్లి సంబరాలు ఘనంగా ముగిశాయి. నేడు అర్జున్ కుమార్తె ఐశ్వర్య అర్జున్, తమిళ హీరో ఉమాపతి రామయ్య వివాహ బంధంతో ఒకటయ్యారు. చెన్నైలోని హనుమాన్ ఆలయంలో జరిగిన వీరి వివాహ వేడుకలకు , సన్నిహితులు, బంధువులు, ఇండస్ట్రీ ప్రముఖులు హాజరయ్యారు.  సముద్రఖని, విశాల్‌ తండ్రి జీకే రెడ్డి, కేఎస్ రవికుమార్‌, నటుడు విజయ కుమార్‌తో పాటు పలువురు తమిళ స్టార్స్ వివాహ వేడుకల్లో పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు. వివాహ వేడుకల అనంతరం చెన్నైలోని ఓ స్టార్ హోటల్లో ఐశ్వర్య, ఉమాపతి రెసెప్షన్ వేడుకలు జరగనున్నాయి. ఐశ్వర్య అర్జున్‌ వెడ్డింగ్ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఈ ఫోటోలు మీరు కూడా చూసేయండి. 

publive-image

publive-image

publive-image

publive-image

publive-image

Image

publive-image

Also Read: RT75 : ‘ధమాకా’ కాంబో ఈజ్ బ్యాక్.. పూజా కార్యక్రమాలతో మొదలైన ‘RT75’ మూవీ.. వైరల్ అవుతున్న పిక్స్!

Advertisment
Advertisment
తాజా కథనాలు