Saripodhaa Sanivaaram: నాని ‘సరిపోదా శనివారం’ నుంచి అదిరిపోయే అప్డేట్

వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో టాలీవుడ్ స్టార్ హీరో నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'సరిపోదా శనివారం'. తాజాగా మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్. సరిపోదా శనివారం ఫస్ట్ సింగిల్ 'గ‌రమ్ గ‌ర‌మ్' సాంగ్ జూన్15 న విడుదల చేయనున్నట్లు తెలిపారు.

New Update
Saripodhaa Sanivaaram:  నాని ‘సరిపోదా శనివారం’ నుంచి అదిరిపోయే అప్డేట్

Saripodhaa Sanivaaram: నేచురల్ స్టార్ నాని లేటెస్ట్ అప్ కమింగ్ ఫిల్మ్ 'సరిపోదా శనివారం '. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయికగా నటిస్తోంది. డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్ పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లిమ్ప్స్, టీజర్ ప్రేక్షకులలో ఆసక్తిని పెంచగా.. తాజాగా ఫ్యాన్స్ కు మరో అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్.

ఫస్ట్ సింగిల్ అనౌన్స్మెంట్
తాజాగా మేకర్స్ సరిపోదా శనివారం ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ 'గరం గరం ' పాటను జూన్ 15 న విడుదల చేయనున్నట్లు పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో ప్రముఖ నటులు ఎస్. జే సూర్య, సాయి కుమార్ ప్రధాన పాత్రలు పోషించారు. 'అంటే సుందరానికి ' లాంటి సూపర్ హిట్ తర్వాత వివేక్, నాని కంబో మరోసారి రిపీట్ కావడం సినిమా పై అంచనాలను పెంచేస్తోంది. 'సరిపోదా శనివారం ' ఆగస్టు 29న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Also Read: Aishwarya Arjun: తమిళ హీరోతో అర్జున్ కుమార్తె ఐశ్వర్య వివాహం.. వైరలవుతున్న ఫొటోలు

Advertisment
తాజా కథనాలు