/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/FotoJet-2023-12-28T194056.742-jpg.webp)
Hi Nanna OTT Release: ఇప్పటికే థియేటర్స్ లో విడుదలై సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకున్న ఓటీటీ లో కూడా సందడి చేస్తున్నాయి. ఇక తాజాగా విడుదలైన హాయ్ నాన్న చిత్రం కూడా ఓటీటీ రిలీజ్ కు రెడీ అవుతున్నట్లు సమాచారం. శౌర్యువ్ దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని (Hero Nani), సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ (Mrunal Takur) కలిసి జంటగా నటించిన చిత్రం హాయ్ నాన్న. డిసెంబర్ 7 న తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదలైన ఈ బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. రొమాంటిక్, ఎమోషనల్ డ్రామా చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు ఇతర ప్రేక్షకులను కూడా బాగా ఆకట్టుకుంది. సినిమా స్టోరీ ప్రధానంగా తండ్రి, కూతుళ్ళ బాండింగ్ పై ఉండడంతో ప్రేక్షకులకు ఎమోషనల్ గా బాగా కనెక్ట్ అయ్యింది. థియేటర్స్ లో సూపర్ హిట్ రెస్పాన్స్ సొంతం చేసుకున్న 'హయ్ నాన్న' ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉంది. వచ్చే ఏడాది జనవరిలో ఓటీటీ వేదిక పై రానున్నట్లు తెలుస్తోంది.
Also Read: Salaar Collections: బాక్సాఫీస్ వద్ద సలార్ సునామీ.. 500 కోట్లతో ప్రభాస్ ఊచకోత
ఈ సినిమా విడుదలైన 45 రోజుల తర్వాతే ఓటీటీ విడుదలకు నెట్ ఫ్లిక్స్ (Netflix) ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. కావున సంక్రాంతికి విడుదలయ్యే అవకాశం లేదు. జనవరి 19 లేదా ఆ తర్వాత OTT వేదిక నెట్ ఫ్లిక్స్ లో రానున్నట్లు సమాచారం. ఈ సినిమాలో శృతి హాసన్ కీలక పాత్రలో కనిపించింది. శౌర్యువ్ మొదటి సినిమాలోనే అద్భుతమైన స్టోరీని అందించి ప్రేక్షకులను మెప్పించాడు. సినిమాలో నాని, బేబీ కియార మధ్య జరిగే సన్నివేశాలు, డైలాగ్స్ అందరినీ ఆకట్టుకునేలా ఉన్నాయి. తండ్రి, కూతుళ్ళ మధ్య ఉండే కొన్ని ఎమోషనల్ సీన్స్ సినిమాకు హైలెట్ గా నిలిచాయి. సినిమా సాంగ్స్ కూడా మంచి హిట్ అయ్యాయి. హేషామ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందించారు.
Also Read: Hi Nanna Movie Review: ఎమోషనల్ లవ్ డ్రామా ‘హాయ్.. నాన్న’ సినిమా ఎలా ఉంది అంటే..