/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/FotoJet-2024-03-31T133019.471-jpg.webp)
Nani 33 Movie : నేచురల్ స్టార్ నాని వరుస విజయాలతో దూసుకెళ్తున్నారు. గతేడాది హాయ్ నాన్న, అంతక ముందు వచ్చిన దసరా చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. ప్రస్తుతం ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సరిపోదా శనివారం’ మూవీలో నటిస్తున్నారు నాని. పక్కా మాస్ కమర్షియల్ గా రూపొందిన ఈ సినిమా టీజర్, ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇందులో నాని మాస్ అవతార్ లో కనిపించునున్నారు. ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయికగా నటించగా.. స్టార్ నటుడు ఎస్.జె.సూర్య కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే భారీ అంచనాలను ఏర్పర్చుకున్న ఈ మూవీ ఆగస్టు 29న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read : Hero Nitin : పవన్ టైటిల్ తో నితిన్ మూవీ.. అదిరిపోయిందిగా .. ‘తమ్ముడు’ ఫస్ట్ లుక్ పోస్టర్
నాని - శ్రీకాంత్ కాంబో రిపీట్
ఇది ఇలా ఉంటే.. తాజాగా మరో అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు హీరో నాని (Hero Nani). నాని, శ్రీకాంత్ ఓదెల కాంబోలో విడుదలైన 'దసరా' చిత్రం. బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే మార్చి 30తో ఈ సినిమా ఏడాది పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా శ్రీకాంత్ కాంబోలో రాబోతున్న మరో సినిమాను అనౌన్స్ చేశారు నాని. #Nani 33 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీ పోస్టర్ ను రిలీజ్ చేశారు. దసరా లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఈ కాంబో మరో సారి రిపీట్ కావడం అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. ఎస్‌ఎల్వీ సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చేకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Dasara turns one year today. On this occasion ..#Nani33
A Srikanth Odela MADNESS again. pic.twitter.com/RuNp8ljNVo— Hi Nani (@NameisNani) March 30, 2024
Also Read : Jai Hanuman : గూస్ బంప్స్ గ్యారెంటీ.. జై హనుమాన్ నుంచి అదిరే అప్‌డేట్.. “అంజనాద్రి 2.0”