Hero Karthi: అమ్మ లేని ఇల్లు బోసిపోయింది..హీరో కార్తీ ఎమోషనల్‌ పోస్ట్‌!

అమ్మ లేని ఇల్లు బోసిపోతుంది. ఎందుకంటే జ్యోతిక వదినని నేను ఎప్పుడూ కూడా వదినగా చూడలేదు. అమ్మగానే చూశాను. ఆమె కూడా నన్ను ఎప్పుడూ కూడా మరిదిలాగా చూడలేదు. తన పిల్లలతో సమానంగా నన్ను కూడా ఒక కొడుకులాగే చూసేదని ఆయన తెలిపారు.

New Update
Hero Karthi: అమ్మ లేని ఇల్లు బోసిపోయింది..హీరో కార్తీ ఎమోషనల్‌ పోస్ట్‌!

యుగానికి ఒక్కడు సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు తమిళ నటుడు కార్తీ. సినీ హీరో సూర్య తమ్ముడుగానే కాకుండా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. నాగార్జున వంటి అగ్ర హీరోలతో నటించి తనలోని నటుడ్ని మరింత బయటకు తీశాడు. తనలోని హీరోయిజంతో పాటు కామెడీని కూడా బయటకు తీస్తాడు కార్తీ.

అయితే కార్తీ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో పోస్ట్ చేసిన ఓ పోస్ట్‌ ప్రస్తుతం నెట్టింట వైరల్‌ గా మారింది. ఎందుకంటే.. కార్తీ పోస్ట్ పెట్టింది తన అన్న భార్య జ్యోతిక గురించి. జ్యోతిక గురించి తెలియని వారుండరు ఆమె చాలా సినిమాల్లో నటించి నటుడు సూర్యని వివాహం చేసుకుని ఆడపాదడపా సినిమాలు చేస్తున్నారు.

ప్రస్తుతం సూర్య జ్యోతిక తమ పిల్లల చదువుల నిమిత్తంగా ముంబైలో ఉండాల్సి వస్తుంది. అయితే సూర్య మాత్రం షూటింగ్ ల నిమిత్తం చెన్నై నుంచి ముంబైకి వెళ్లి వస్తున్నాడు. చెన్నై నుంచి రోజు వెళ్లి రావడం అనేది కష్టంగా ఉండటంతో సూర్య వాళ్లు ప్రస్తుతం ముంబైకి మకాం మార్చారు. దీంతో చెన్నైలో శివకుమార్‌ ఇళ్లు బోసిపోయింది.

దీని గురించి కార్తీ ఎమోషనల్‌ గా ఫీల్ అవుతూ..'' అమ్మ లేని ఇల్లు బోసిపోతుంది. ఎందుకంటే జ్యోతిక వదినని నేను ఎప్పుడూ కూడా వదినగా చూడలేదు. అమ్మగానే చూశాను. ఆమె కూడా నన్ను ఎప్పుడూ కూడా మరిదిలాగా చూడలేదు. తన పిల్లలతో సమానంగా నన్ను కూడా ఒక కొడుకులాగే చూసేదని ఆయన తెలిపారు.

ప్రస్తుతం అమ్మ వాళ్లు ముంబైలో ఉంటున్నారు. వారు ఈ ఇల్లు వదిలి ముంబైలో ఉండటం చాలా బాధగా ఉంది. కానీ అమ్మలేని ఇంట్లో ఉండటం నా వల్ల కావడం లేదు. ఇన్ని రోజులు ఈ ఇల్లు ఉమ్మడి కుటుంబంలా కలిసి మెలిసి ఉందంటే మాత్రం దానికి కారణం మా అమ్మే.

మేము అంతా కలిసి ఉన్న రోజులు గుర్తుకు వస్తుంటే నా గుండె చాలా బరువెక్కుతోంది. అన్నయ్య పిల్లలు పెద్ద వాళ్లు అవుతున్నారు. వారి పిల్లల చదువుల కోసం మాత్రమే వారు ముంబయిలో ఉంటున్నారు. ప్రస్తుతం పండుగులకు కలుస్తునాం.మళ్లీ అందరం కలిసుండే రోజు కోసం ఎదురు చూస్తున్నా'' అంటూ కార్తీ సోషల్‌ మీడియాలో పోస్ట్ పెట్టాడు.

దీనిని చూసిన అభిమానులు త్వరలోనే మీరంతా కలిసి ఉంటారని పేర్కొంటున్నారు. ప్రస్తుతం కార్తీ చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు