Bhimaa Trailer: 'క‌రుణే చూప‌ని బ్ర‌హ్మ‌రాక్ష‌సుడు'.. గోపీచంద్ భీమా ట్రైలర్

గోపీచంద్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం 'భీమా'. యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ సినిమాను కన్నడ డైరెక్టర్ హర్ష తెరకెక్కించారు. తాజాగా మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేసింది చిత్ర బృందం. పోలీస్ ఆఫీసర్ గా గోపీచంద్ యాక్షన్ సీన్స్, పవర్ ఫుల్ డైలాగ్స్ తో ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది.

New Update
Bhimaa Trailer: 'క‌రుణే చూప‌ని బ్ర‌హ్మ‌రాక్ష‌సుడు'.. గోపీచంద్ భీమా ట్రైలర్

Bhimaa Trailer: మ్యాచో స్టార్ గోపీచంద్ చాలా రోజుల నుంచి మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. రీసెంట్ గా విడుదలైన 'రామబాణం' మూవీ కూడా ఆశించినంత ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. దీంతో గోపీచంద్ ఆశలన్నీ లేటెస్ట్ మూవీ 'భీమా' పైనే ఉన్నాయి. ఇక అంచనాలకు తగ్గట్లే తాజాగా విడుదలైన ట్రైలర్ సూపర్ రెస్పాన్స్ తో సోషల్ మీడియాలో టాప్ 2 ట్రెండింగ్ గా సాగుతోంది.

భీమా ట్రైలర్

గోపీచంద్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా రూపొందిన ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ చిత్రాన్ని కన్నడ మాస్ డైరెక్టర్ హర్ష తెరకెక్కించారు. అయితే తాజాగా చిత్ర బృందం మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేసింది. ముందుగా హీరో పాత్రను ఎలివేట్ చేసేందుకు పవర్ ఫుల్ డివోషనల్ డైలాగ్స్ తో ట్రైలర్ మొదలవుతుంది. ప‌ర‌శురాముడు త‌న గండ్ర గొడ్డ‌లితో అనంత‌సాగ‌రాన్నే వెన‌క్కి పంపి ఒక అద్భుత‌మైన నేల‌ను సృష్టించాడు అనే డైలాగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. త్రినేత్రుడే కాల‌నేత్రుడై క‌రుణే చూప‌ని బ్ర‌హ్మ‌రాక్ష‌సుడిని పంపించాడు అనే పవర్ ఫుల్ డైలాగ్ తో.. పోలీస్ ఆఫీసర్ గా గోపీచంద్ ఎంట్రీ ఇస్తాడు. రాక్షసుల మధ్య ధర్మాన్ని కాపాడే పోలీస్ ఆఫీసర్ గా గోపిచంద్ పాత్ర ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

పవర్ ఫుల్ డైలాగ్స్ 

"నేను ఊచ‌కోత మొద‌లుపెడితే ఈ ఊరిలో స్మ‌శానం కూడా స‌రిపోదు" గోపీచంద్ చెప్పే డైలాగ్స్ గూస్ బంప్స్ తెప్పించేలా ఉన్నాయి. యాక్షన్ సీక్వెన్సెస్, విఎఫ్ఎక్స్ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ట్రైలర్ లో ప్రకారం సినిమాలో గోపీచంద్ రెండు డిఫరెంట్ షేడ్స్ లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. పవర్ ఫుల్ ట్రైలర్ తో సినిమా పై మరింత ఆసక్తిని పెంచారు మేకర్స్.

publive-image

ఈ సినిమాలో ప్రియా భవాని శంకర్, మాళవికశర్మ కథానాయికలుగా నటించారు. గతంలో పోలీస్ పాత్రలో గోపీచంద్ చేసిన గోలీమార్, ఆంధ్రుడు చిత్రాలు బిగ్గెస్ట్ హిట్స్ గా నిలిచాయి. ఇక 'బీమా' ట్రైలర్ తో అదే జానర్ లో వస్తున్న ఈ మూవీ కూడా సూపర్ హిట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ సినిమా ఫిబ్రవరి 16న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Also Read: Karthika Deepam: ‘కార్తీక దీపం’ నవ వసంతం.. మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వంటలక్క, డాక్టర్ బాబు

Advertisment
తాజా కథనాలు