Kitchen Tips: ఆకు కూరలు ఇంట్లో తాజాగా ఉండాలంటే ఇలా చేయండి

మన ఆరోగ్యానికి ఆకు కూరలు చాలా మంచిది. పాలకూర, తోటకూర, బచ్చలి, మెంతి, గోంగూర వంటి ఆకుకూరల్లో పొటాషియం, సోడియం, ప్రొటీన్లు, మెగ్నీషియం, కాల్షియం, ఫోలేట్‌, ఐరన్‌, విటమిన్లు వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఆకు కూరలను రోజూ తింటే అనేక సమస్యలు తగ్గిపోయి ఆరోగ్యంగా ఉంటారు.

Kitchen Tips: ఆకు కూరలు ఇంట్లో తాజాగా ఉండాలంటే ఇలా చేయండి
New Update

Greens Fresh Tips: మన ఆరోగ్యానికి ఆకు కూరలు చాలా మంచిదని డాక్టర్లు చెబుతూంటారు. ఆకు కూరలను రోజూ తింటే అనేక సమస్యలు తగ్గిపోయి ఆరోగ్యంగా ఉంటారు. వాటిల్లో పాలకూర, తోటకూర, బచ్చలి, మెంతి, గోంగూర వంటి ఆకుకూరల్లో పొటాషియం, సోడియం, ప్రొటీన్లు, మెగ్నీషియం, కాల్షియం, ఫోలేట్‌, ఐరన్‌, విటమిన్లు వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా ఆకుకూరల్లో ఉన్న ఫైబర్‌ జీర్ణక్రియకు ఎంతగానో సహాయపడుతుంది. వీటిలో ఉండే విటమిన్‌ సి, ఇ, బీటా కెరొటిన్‌ కంటిచూపుకు చాలా మంచిది. అంతేకాకుండా వీటిల్లో యాంటీ ఆక్సిడెంట్లు గాయాలను కూడా తగ్గిస్తుంది. వీటిల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టే డాక్టర్లు రోజూ ఆకుకూరలను తినాలని అంటున్నారు. అయితే ఈ ఆకు కూరలను రోజూ కొనలేము కాబట్టి ఒకసారి తెచ్చుకొని మూడు నాలుగు రోజులు నిల్వ చేసుకుంటారు. ఆలా చేస్తే ఆకులు పాడై పోతాయి. మరి ఈ ఆకులు కొద్ది రోజులు ఫ్రెష్‌గా ఉండాలంటే కొన్ని చిట్కాలతో మీ ఆకుకూరలు ఫ్రెష్‌గా ఉంటాయి. ఇప్పుడు అవి ఎలా నిల్వ చేసుకోవాలో ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం.

ఆకు కురలు ఫ్రెష్‌గా ఉండాలంటే ఇలా చేయాలి

  • ఆకుకూరలు ఎక్కువ రోజూలు నిల్వ ఉండాలంటే.. ఆకులను కత్తిరించి జిప్‌ మరియు లాక్‌ బ్యాగ్‌లో పెట్టాలి. దీనిని ఫ్రీజర్‌లో స్టోర్‌ చేస్తే ఆకులు ఎక్కువ రోజులు ఫ్రెష్‌గా ఉంటాయి.
  • ముఖ్యంగా ఆకుకూరలు కొన్న వెంటనే వాటిలోని చెడిపోయిన ఆకులను క్లీన్‌ చేయాలి. ఆ తర్వాత కాడలు కత్తిరించి న్యూస్‌ పేపర్‌లో పెట్టి రోల్‌ చేయాలి. ఈ రోల్‌ను జిప్‌-లాక్‌ బ్యాగ్‌లో సీల్‌ చేసే ముందు బ్యాగ్‌ నుంచి లోపల గాలి లేకుండా చూసి రిఫ్రిజిరేటర్‌లో పెట్టుకోవాలి.
  • ఆకుకూరలు త్వరగా చెడిపోవడానికి ప్రధాన కారణం ఎక్కువ తేమ. ఎవరైనా.. ఆకుకూరలను స్టోర్‌ చేయాలనుకుంటే ముందుగా ఆకులు పొడిగా ఉండేలా చూసుకోవాలి.
  • చెడిపోయిన, దెబ్బతిన్న -ఆకులను తీసి శుభ్రమైన క్లాత్‌లో చుట్టి రిఫ్రిజిరేటర‌లో పెట్టాలి. ఈ విధంగా చేస్తే ఆకుకూరలు పాడవకుండా కొన్ని రోజులు ఫ్రెష్‌గా ఉంటాయి.
  • బచ్చలికూర ఎక్కువ రోజులు ఫ్రెష్‌గా ఉండాలంటే ఇథిలీన్‌ గ్యాస్‌ రిలీజ్‌ చేసే పండ్లకు దూరంగా పెట్టి.. గాలి పోని కంటైనర్‌లో పెట్టుకుంటే తాజాగా ఉంటాయి.
  • ముందుగా పాడైన ఆకులను క్లీన్‌ తీసి ఆకుకూరల చివర్ల కట్‌ చేయాలి. తరువాత ఎయిర్‌ టైట్‌ కంటైనర్‌లో మస్లిన్‌ క్లాత్‌ వేసి ఈ ఆకుకూరలను దానిలో పెట్టాలి. ఇలా చేస్తే ఆకుకూరలు కొన్ని రోజులు ఫ్రెష్‌గా ఉంటాయి. ఇలా మీకు కూడా ట్రై చేసి చూడండి.

ఇది కూడా చదవండి: ఉదయాన్నే తులసి నీళ్లు తాగితే జరిగే అద్భుతాలు ఇవే

#health-benefits #kitchen-tips #greens-fresh
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe