World Richest Cities: మనం ప్రపంచవ్యాప్తంగా ఉన్న బిలియనీర్ల గురించి చాలా కథలు వింటూ వస్తున్నాం. ఎవరి సంపద తగ్గింది, ఎవరి సంపద పెరిగింది, ఎవరు టాప్ 10లో చేరారు లేదా ఎవరి సంపద ఒక్కసారిగా కరిగిపోయింది. ఇలా ఎప్పటికప్పుడు కథనాలు వింటూనే ఉంటాం. అయితే ఈ ధనవంతులు ఎక్కడ నివసిస్తున్నారని మనకు అప్పుడప్పుడు డౌట్ వస్తుంటుంది. కదా. మన దేశంలో అలాగే, ప్రపంచంలోని ఏ నగరాల్లో అత్యంత ధనవంతులు నివసిస్తున్నారు? అని సందేహం రావడం సహజం. ఆ సందేహాన్ని తీర్చే స్టోరీ ఇదే. ప్రపంచంలోని ప్రముఖ సర్వే ఏజెన్సీ అయిన హెన్లీ & పార్ట్‌నర్స్ 2024కి సంబంధించి ప్రపంచంలోని అత్యంత సంపన్న నగరాల జాబితాను విడుదల చేసింది . ప్రపంచంలోని టాప్ 50 సంపన్న నగరాల జాబితాను ఈ సంస్థ వెల్లడించింది. ఈ టాప్ 50 లిస్ట్ లో రెండు భారతీయ నగరాలు కూడా ఉన్నాయి. అవి ఢిల్లీ - ముంబై.
సంపన్న నగరాల్లో ముంబై - ఢిల్లీ ర్యాంక్
World Richest Cities: డ్రీమ్ సిటీ ముంబయి ఈ లిస్టులో 24వ స్థానంలో ఉంది. మన దేశ రాజధానై ఢిల్లీ 37వ స్థానంలో ఉంది. ముంబైలో మొత్తం 29 మంది బిలియనీర్లు నివసిస్తున్నారు. ఇది కాకుండా, 58,800 మంది మిలియనీర్లు- 236 మంది సెంటి మిలియనీర్లు ఉన్నారు. 100 మిలియన్ డాలర్ల కంటే ఎక్కువ పెట్టుబడి పెట్టగల ఆస్తులను సెంటి మిలియనీర్లు అని అంటారు.
World Richest Cities: ముంబై దేశ ఆర్థిక రాజధాని. టాటా, అంబానీ, అదానీ వంటి పారిశ్రామికవేత్తల నుండి షారుక్, సల్మాన్ వంటి పెద్దల వరకు ఈ నగరంలోనే నివసిస్తున్నారు. అటువంటి పరిస్థితిలో, ముంబైలో బిలియనీర్లు - మిలియనీర్ల సంఖ్య ఆశ్చర్యం కలిగించదు. అయితే గత 10 ఏళ్లలో ఢిల్లీలో బిలియనీర్లు పెరిగిన తీరు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఢిల్లీలో 16 మంది బిలియనీర్లు నివసిస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఢిల్లీలో 123 శాతం మంది మిలియనీర్లు అలాగే, 30,700 మంది సెంటి మిలియనీర్లు ఉన్నారు.
అంతర్జాతీయ నగరాలను కూడా దాటుకుని..
World Richest Cities: గణాంకాల పరంగా ముంబయి కంటే ఢిల్లీ వెనుకబడినట్లు కనిపించినా.. బిలియనీర్లను ఆకర్షించే విషయంలో మాత్రం ముంబాయిని మాత్రమే కాకుండా, మాస్కో, తైపీ, వాషింగ్టన్ డీసీ వంటి నగరాలను కూడా ఢిల్లీ వెనక్కి నెట్టేస్తున్నట్టు కనిపిస్తోంది. గత 10 ఏళ్లలో అంటే 2013 - 2023 మధ్య ఢిల్లీలో ధనవంతుల వృద్ధి రేటు 95 శాతం ఉండగా, ముంబైలో ధనవంతులు 82 శాతం చొప్పున వృద్ధి చెందారు.
Also Read: అదిరి పోయే ఫీచర్స్ తో కొత్త ప్రొడక్ట్స్ ను రిలీజ్ చేస్తున్న యాపిల్..
న్యూయార్క్‌లో అత్యంత ధనవంతులు..
World Richest Cities: ఇప్పుడు ఈ నివేదికలోని ఇతర అంశాలను కూడా పరిశీలిద్దాం. ప్రపంచంలో అత్యధిక ధనవంతుల సంఖ్యతో న్యూయార్క్ నంబర్ 1 స్థానంలో ఉంది. న్యూయార్క్ నగరం మొత్తం సంపద US$3 ట్రిలియన్లను మించిపోయింది. ఇది చాలా ప్రధాన G20 దేశాల ఉమ్మడి సంపద కంటే ఎక్కువ. న్యూయార్క్‌లో 60 మంది బిలియనీర్లు నివసిస్తున్నారు. అయితే, ప్రతి నగరం పరిస్థితి ఒకేలా లేదు. గత సంవత్సరాలతో పోలిస్తే లండన్‌లో ధనవంతుల సంఖ్య తగ్గింది. 2024 నివేదిక ప్రకారం, UK రాజధాని గత దశాబ్దంలో 10 శాతం మిలియనీర్లను కోల్పోయింది.
World Richest Cities: 2024 నివేదికలో అమెరికా ఆధిపత్యం చెలాయించింది. అమెరికాలోని 11 నగరాలు టాప్ 50లో ఉన్నాయి. చైనాలోని 5 నగరాలు టాప్ 50లో ఉన్నాయి. ఈ జాబితాలో యూరప్‌లోని 16 నగరాలు, ఆసియాలోని 13 నగరాలు టాప్ 10లో ఉన్నాయి. ఆసియాలోని నాలుగు నగరాలు, టోక్యో, సింగపూర్, హాంకాంగ్ - బీజింగ్ టాప్ 10లో ఉన్నాయి.
ప్రపంచంలోని టాప్ 10 ధనిక నగరాలు ఇవే..
- న్యూయార్క్ నగరం, అమెరికా
- బే ఏరియా, అమెరికా
- టోక్యో, జపాన్
- సింగపూర్, సింగపూర్
- లండన్, యునైటెడ్ కింగ్డమ్
- లాస్ ఏంజిల్స్, అమెరికా
- పారిస్, ఫ్రాన్స్
- సిడ్నీ, ఆస్ట్రేలియా
- హాంగ్ కాంగ్, హాంగ్ కాంగ్
- బీజింగ్, చైనా