Jharkhand Politics : ఒకరోజు జ్యుడీషియల్ కస్టడీకి హేమంత్ సోరెన్‌..రిమాండ్ పై నిర్ణయం ఎప్పుడంటే..?

హేమంత్‌ సొరేన్‌ను అరెస్టు చేసిన ఈడీ కోర్టులో హాజరుపరిచింది. సోరెన్‌ ను 10 రోజుల రిమాండ్‌ కు అప్పగించాల్సిందిగా ఈడీ కోర్టును కోరింది. ఒకరోజు జ్యుడీషియల్ కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది. రిమాండ్ పై శుక్రవారం నిర్ణయం తీసుకోనుంది.

Jharkhand Politics : ఒకరోజు జ్యుడీషియల్ కస్టడీకి హేమంత్ సోరెన్‌..రిమాండ్ పై నిర్ణయం ఎప్పుడంటే..?
New Update

Hemant Soren:  జార్ఖండ్‌ రాజకీయాల్లో సంచలనం రేపిన భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసు(Money laundering case)లో ముఖ్యమంత్రి హేమంత్‌ సొరేన్‌(Hemant Soren)ను ఈడీ(ED) అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. కాగా సోరేన్ ను ఇవాళ రాంచీ కోర్టులో హాజరుపరిచింది ఈడీ. హేమంత్ సోరెన్‌ను కోర్టు ఒకరోజు జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. అనంతరం హేమంత్ సోరెన్‌ను బిర్సా ముండా (Birsa Munda)జైలుకు తరలించారు. సోరెన్‌కు 10 రోజుల రిమాండ్‌ ఇవ్వాల్సిందిగా ఈడీ కోర్టును కోరింది. అయితే రిమాండ్‌పై శుక్రవారం చర్చ జరిగిన అనంతరం కోర్టు తీర్పు వెలువరించనుంది.

సుదీర్ఘ విచారణ తర్వాత సోరెన్‌ను అరెస్టు:
భూ ఒప్పందానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) వర్కింగ్ ప్రెసిడెంట్ సోరెన్‌ను బుధవారం రాత్రి తన అధికారిక నివాసంలో ఏడు గంటలపాటు విచారించిన అనంతరం ఈడీ అరెస్టు చేసింది. భారీ భద్రత మధ్య సోరెన్‌ను ఈడీ పీఎంఎల్‌ఏ కోర్టులో (PMLA Court) హాజరుపరిచింది.

ఎందుకు అరెస్టు చేశారన్న విషయాన్ని కోర్టుకు తెలిపిన ఈడీ:
ఈడీ విచారణకు సంబంధించిన కొన్ని రికార్డులను కూడా కోర్టులో సమర్పించింది. ఏప్రిల్ 13, 2023న జరిగిన దాడిలో రెవెన్యూ సబ్ ఇన్‌స్పెక్టర్ భాను ప్రతాప్ ప్రసాద్ ఇంట్లో పెద్ద సంఖ్యలో భూమికి సంబంధించిన రికార్డులు, రిజిస్టర్లు దొరికాయని ఈడీ కోర్టుకు తెలిపింది. జూన్ 1, 2023న రాంచీ పోలీసులు భాను ప్రతాప్‌పై రాంచీలో (Ranchi) కేసు నమోదు చేశారు. దీని తర్వాత, జూన్ 26, 2023న, రాంచీ పోలీసుల ఎఫ్‌ఐఆర్ ఆధారంగా, ఈడీ ఈ విషయంలో మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. ప్రభుత్వ భూములను పెద్దఎత్తున నకిలీ సేల్‌ డీడ్‌లు తయారు చేసి రెవెన్యూ రికార్డులను తారుమారు చేస్తూ భూములను కబ్జా చేసే బడా సిండికేట్‌లో భాను ప్రతాప్‌ ఉన్నట్లు విచారణలో తేలింది.

హేమంత్ సోరెన్‌ ఆధీనంలో వేల ఎకరాలు:
హేమంత్ సోరెన్ ఆధీనంలో వేల ఎకరాల భూమి ఉన్నట్లు ఈడీ విచారణలో తేలింది. భానుప్రతాప్ మొబైల్ నుండి సోరెన్‌కి చెందిన అనేక ఆస్తుల గురించిన సమాచారాన్ని సేకరించారు. 8.5 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న 12 భూముల జాబితాను గుర్తించారు.హేమంత్ సోరెన్ ఈ భూములను అక్రమంగా ఆక్రమించుకున్నాడు. ఈ భూముల ఫొటోలపై భానుప్రతాప్ చేతిరాతతో ఏదో ఒకటి రాసి వాటిని ధృవీకరించారు.

సోరెన్ అక్రమంగా స్వాధీనం చేసుకున్నాడు:ఈడీ
ఈ కేసులో పీఎంఎల్‌ఏ కింద చాలా మంది వాంగ్మూలాలు నమోదు చేసింది ఈడీ. ఈ భూములను సోరెన్ ఆక్రమించారని, అవి సోరెన్‌కు చెందినవని కావని ఈడీ ముందు తెలిపారు. పీఎంఎల్‌ఏ కింద ఈడీ సర్వే నిర్వహించి సోరెన్‌ ఈ భూములను అక్రమంగా ఆధీనంలోకి తీసుకున్నట్లు తేలింది. సోరెన్ ఢిల్లీ ఇంట్లో సోదాలు చేయగా, గదిలో రూ.36 లక్షలకు పైగా నగదు, భూమి పత్రాలు లభించాయి. ఈ 8.5 ఎకరాల భూమి నేర ఆదాయంలో భాగమని ఈడీ పేర్కొంది.

ప్రభుత్వాన్ని చుట్టుముట్టిన ప్రతిపక్షాలు:
మనీలాండరింగ్ ఆరోపణలపై హేమంత్ సోరెన్‌ను అరెస్టు చేసిన ఒక రోజు తర్వాత, బిజెపి ఈడీ వంటి ఏజెన్సీల ద్వారా ప్రతిపక్షాల గొంతును అణిచివేస్తోందని ప్రతిపక్ష పార్టీల నాయకులు గురువారం ఆరోపించారు. జార్ఖండ్‌లో హేమంత్ సోరెన్‌ను అరెస్టు చేసిన మరుసటి రోజు, రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో గెలవడానికి బీజేపీ ప్రతిపక్ష నాయకులను జైల్లో పెడుతున్నారని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee)  గురువారం ఆరోపించారు. నదియా జిల్లాలోని శాంతిపూర్‌లో జరిగిన ప్రజాపంపిణీ కార్యక్రమంలో బెనర్జీ మాట్లాడుతూ.. ఆమెను కటకటాల వెనక్కి నెట్టినా.. దాని నుంచి బయటపడతానని అన్నారు.

ఇది కూడా చదవండి: 59 ఏళ్ల వయస్సులోనూ పిచ్చేక్కిస్తోంది గురూ…ఈమె బ్యూటీ సీక్రెట్ ఏంటో తెలుసా.?

#ed #jharkhand #jmm #hemant-soren
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe