తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్, విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. విజయవాడ జాతీయరహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. హయత్ నగర్ నుంచి అబ్దుల్లాపూర్, కొత్తగూడెం చౌరస్తా వరకు ట్రాఫిక్ నిలిచిపోయింది. సొంతఊర్లకు వెళ్లే ఓటర్లతో రహదారులపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు ఓఆర్ ఆర్ పై కూడా భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. దీంతో వాహనాలు నెమ్మదిగా ముందుకు సాగుతున్నాయి. అటు హైదరాబాద్ నుంచి అదనపు బస్సులు నడపకపోవడంతో ఎంజీబీఎస్ లో ప్రయాణీకులు తీవ్రఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఓవైపు భారీగా ట్రాఫిక్ జామ్...మరోవైపు బస్సులు లేకపోవడం ప్రయాణీకులకు తీవ్ర ఇబ్బందులు ఎదురౌతున్నాయి. బస్సు స్టాపుల్లోనే పడిగాపులు కాస్తున్నారు.
ఇది కూడా చదవండి: ఉద్యోగులు ఎగిరి గంతేసే వార్త.. ఒకే సారి 2 శుభవార్తలు…!!
traffic-jam