Tirumala: తిరుమలలో పెరిగిన రద్దీ.. శ్రీవారి దర్శనం కోసం భక్తుల క్యూ

తిరుమలలో సాధారణంగా భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంటుంది. అయితే సోమవారం తగ్గిన భక్తులు.. నేడు పెరిగారు. దీంతో స్వామివారి సర్వదర్శనానికి 8 గంటల నుంచి 10 గంటల సమయం పడుతోంది. భక్తులు 12 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.

New Update
Tirumala: తిరుమలలో పెరిగిన రద్దీ.. శ్రీవారి దర్శనం కోసం భక్తుల క్యూ

Tirumala: కలియుగ ప్రత్యక్ష దైవం, ఏడుకొండలవాడు కొలువుతీరిన పుణ్యక్షేత్రాన్ని దర్శించుకునేందుకు భక్తులు క్యూ కడుతుంటారు. అయితే నిన్న(ఆగస్టు 21)తగ్గిన భక్తులు.. నేడు పెరిగారు. దీంతో స్వామివారి సర్వదర్శనానికి 8 గంటల నుంచి 10 గంటల సమయం పడుతోంది. భక్తులు 12 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సోమవారం శ్రీవారిని 69,909 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారికి 29,327 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం 4.37 కోట్ల రూపాయలు వచ్చినట్టు టీటీడీ అధికారులు తెలిపారు.

తిరుమలలో(Tirumala) ఈ ఏడాది రెండు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. అధికమాసం సందర్భంగా సెప్టెంబరు 18 నుంచి 26వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనుండగా.. అక్టోబరు 15 నుంచి 23వ తేదీ వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సెప్టెంబరు 18న ధ్వజారోహణం, 22న గరుడవాహన సేవ, 23న స్వర్ణరథం, 25న రథోత్సవం, 26న చక్రస్నానం, ధ్వజావరోహణం ఉంటాయి. నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా అక్టోబర్ 19న గరుడవాహనం, 22న స్వర్ణరథం, 23న చక్రస్నానం ఉంటాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా సెప్టెంబరు 18 నుంచి 26వ తేదీవరకు, అక్టోబరు 15 నుంచి 23వ తేదీ వరకు అష్టదళపాద పద్మారాధన, తిరుప్పావడ, కల్యాణోత్సవం, సహస్రదీపాలంకార, ఊంజల్‌ సేవలను రద్దు చేశార. అయితే ఆర్జిత బ్రహ్మోత్సవం సేవా టికెట్లు బుక్‌ చేసుకున్నవారికి మాత్రం నిర్దేశిత వాహన సేవలకు మాత్రమే అనుమతిస్తారు.

ఇక ఆగస్టు 24న ప్రముఖ వైష్ణవాచార్యులు శ్రీ తిరుమలనంబి 1050వ అవతార మహోత్సవం దక్షిణ మాడ వీధిలో గల శ్రీ తిరుమలనంబి ఆలయంలో ఘనంగా నిర్వహించ‌నున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. ఉద‌యం 9.30 గంటల నుంచి 16 మంది ప్రముఖ పండితులు శ్రీ తిరుమ‌లనంబి జీవిత చ‌రిత్రపై ఉప‌న్యసించ‌నున్నారని వెల్లడించారు.

మరోవైపు కొన్నిరోజులుగా నడ‌క దారిల్లో క్రూర‌మృగాల క‌ద‌లిక‌ల నేప‌థ్యంలో భ‌క్తుల భ‌ద్ర‌త దృష్ట్యా టీటీడీ ఈవో ధ‌ర్మారెడ్డి (TTD EO Dharma Reddy) ప‌లు సూచ‌న‌లు చేశారు. అలిపిరి న‌డ‌క మార్గంలో వందకు పైగా తినుబండారాలు విక్ర‌యించే దుకాణాలు ఉన్నాయ‌ని, వీటిలో ఇక‌పై పండ్లు, కూర‌గాయ‌లు విక్ర‌యించ‌రాద‌ని ఆదేశించించారు. భ‌క్తులు వీటిని కొనుగోలు చేసి సాధు జంతువుల‌కు తినిపించ‌డం వ‌ల్ల క్రూర‌మృగాల రాక పెరుగుతోంద‌ని.. దీంతో అటువైపు వ‌చ్చే భ‌క్తుల‌పై దాడి చేస్తున్నాయ‌ని ఈవో తెలిపారు.

Also Read: చంద్రయాన్ ల్యాండింగ్ ఆ 17 నిమిషాల 21 సెకన్లు ఎందుకంత కీలకం..!!

Advertisment
తాజా కథనాలు