Telangana : నేడు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు! తెలంగాణ రాష్ట్రంలో మంగళవారం కొన్ని చోట్ల, రేపు కొన్ని చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈరోజు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని పేర్కొంది. By Bhavana 18 Jun 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Telangana : తెలంగాణ రాష్ట్రంలో మంగళవారం కొన్ని చోట్ల, రేపు కొన్ని చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు (Rains) కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం (IMD) తెలిపింది. ఈరోజు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని పేర్కొంది. అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వివరించింది. హైదరాబాద్లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని ఐఎండీ అధికారులు పేర్కొన్నారు. సాయంత్రం, రాత్రి వేళల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షం, ఈదురు గాలులు (30 నుండి 40 కి.మీ.) వీచే అవకాశం ఉన్నట్లు వివరించారు. గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు వరుసగా 35 డిగ్రీలు, 26 డిగ్రీలుగా నమోదయ్యే అవకాశలున్నట్లు అధికారులు తెలిపారు. ఉపరితల గాలులు పశ్చిమ దిశలో వీచే అవకాశం ఉందని పేర్కొన్నారు. గాలి వేగం గంటకు 6-8 కి.మీ. నిన్న గరిష్ట ఉష్ణోగ్రత 34.9 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 26.1 డిగ్రీలుగా నమోదైంది. గాలి తేమ 71 శాతంగా నమోదైంది. ఇక ఉత్తర కోస్తాలో ఒకటి రెండు చోట్ల ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఒకటి రెండు చోట్ల పిడుగులు పడే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాలో కూడా ఒకటి రెండు ఉరుములతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని చోట్ల 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు వివరించారు. రాయలసీమ (Rayalaseema) లో కూడా ఒకటి రెండు చోట్ల ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశాలున్నాయి. గంటకు 40 నుంచి 50 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. Also read: తీహార్ జైలుకు మాజీ మంత్రులు.. కవితతో ములాఖత్! #telangana #rains #hyderabad #imd మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి