Telangana : తెలంగాణలో నాలుగు రోజుల పాటు వానలే..వానలు.. ఆ జిల్లాలకు..!

అల్పపీడన ప్రభావం వల్ల తెలంగాణలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు పడే అవకాశాలున్నాయి. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని పలు జిల్లాలకు అధికారులు ఎల్లో అలర్ట్‌ జారీ చేశారు. గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అధికారులు పేర్కొన్నారు.

New Update
Again rain: అలర్ట్: మూడు రోజుల పాటు తెలంగాణలో మళ్లీ వర్షాలు..!

Rain Alert : ఉత్తర పశ్చిమ బెంగాల్‌,ఈశాన్య జార్ఖండ్‌ (Jharkhand) ప్రాంతాల్లో అల్పపీడన ప్రభావం కొనసాగుతోంది. ఆవర్తనం సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో కేంద్రీకృతమై ఉంది. దీని ప్రభావం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా గత కొద్ది రోజులుగా వర్షాలు కురుస్తుండగా..మరో 4 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం (IMD) హెచ్చరించింది.

ఈ క్రమంలోనే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ అంచనా వేసింది. ఈ మేరకు రాష్ట్రంలోని పలు జిల్లాలకు అధికారులు ఎల్లో అలర్ట్‌ జారీ చేశారు.నిర్మల్‌, నిజామాబాద్‌, కామారెడ్డి, జగిత్యాల, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మెదక్‌, ములుగు, ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశాలున్నట్లు అధికారులు తెలిపారు.

ముఖ్యంగా.. నిర్మల్‌, నిజామాబాద్‌, రంగారెడ్డి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఎకువగా ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది.

Also Read: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు తప్పిన ప్రమాదం

Advertisment
Advertisment
తాజా కథనాలు