Heavy Rains : ఇథియోపియా (Ethiopia) లోని వోలాటా ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా కొండచరియలు (Landslides) విరిగిపడటంతో ఇప్పటి వరకు 13 మంది మరణించారని అధికారులు పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో చాలా మంది గల్లంతు కావడంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశాలున్నాయి. దాదాపు 300 మందికి పైగా ప్రజలను కాపాడి సురక్షిత ప్రాంతాలకు తరలించామని, ఈ ప్రమాదంలో గల్లంతైన వారి సంఖ్య ఇంకా తెలియరాలేదని వోలైటా మండల ప్రధాన పరిపాలనాధికారి శామ్యూల్ ఫోలా తెలిపారు.
మృతి చెందిన వారిలో చిన్నారులు కూడా ఉన్నారని ఫోలా పేర్కొన్నారు. ఇంకా కొండచరియలు విరిగిపడే అవకాశం ఉందన్న భయంతో ముందు జాగ్రత్తగా 300 మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించామన్నారు. వోలైటా ప్రాంతంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. గత నెల ప్రారంభంలో దక్షిణ ఇథియోపియాలోని మరొక ప్రాంతంలో కొండచరియలు విరిగిపడటంతో 200 మందికి పైగా మరణించిన విషయం తెలిసిందే.
Also read: నేల కూలిన సినిమా చెట్టు…ఈ చెట్టు ఉంటే..కచ్చితంగా హిట్టు!