TG Rains: కలెక్టర్లు సహాయక చర్యల్లో నిమగ్నమవ్వండి.. మంత్రి పొంగులేటి ఆదేశాలు!

తెలంగాణలో భారీ వర్షాల నేపథ్యంలో అధికారులకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. జిల్లా యంత్రాంగం సహాయ పునరావాస చర్యల్లో నిమగ్నమై ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.

TG Rains: కలెక్టర్లు సహాయక చర్యల్లో నిమగ్నమవ్వండి.. మంత్రి పొంగులేటి ఆదేశాలు!
New Update

Ponguleti Srinivas: తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఆదివారం సాయంత్రం అన్ని జిల్లాల్లో వరద పరిస్థితిని సమీక్షించిన ఆయన గోదావరి ఉద్రితిపై నిరంతరం నిఘా పెట్టాలని సూచించారు. ఈ మేరకు జిల్లా యంత్రాంగం సహాయ పునరావాస చర్యల్లో నిమగ్నమై ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. గోదావరి ఉధృతి వల్ల అక్కడి పరివాహ ప్రాంతాల ప్రజలకు ఎలాంటి ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరగకుండా రెస్కూటీమ్‌లు, ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలను వినియోగించాలని అధికారులను ఆదేశించారు.

ఏవిధమైన ప్రాణ, ఆస్తి నష్టం జరుగకుండా..
అలాగే లోతట్టు ప్రాంతాలు, వరద ముంపు ప్రాంతాల్లో చేపట్టవలసిన రక్షణ సంబంధిత చర్యల గురించి ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జిల్లాల కలెక్టర్లు ఏవిధమైన ప్రాణ, ఆస్తి నష్టం జరుగకుండా సంబంధిత ప్రభుత్వ విభాగాలతో కలసి ముందు జాగ్రత చర్యలు తీసుకోవాలని తెలియచేశారు. ప్రధానంగా వాగుల వద్ద తగు బందోబస్తును ఏర్పాటు చేసి, ప్రమాదకరంగా ప్రవహించే వాగులను ప్రజలు దాటకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కోరారు.

ఇది కూడా చదవండి: AP News: రాష్ట్రంలో అరాచక, ఆటవిక పాలన నడుస్తోంది.. గవర్నర్‌కు జగన్‌ కంప్లైంట్!

జిల్లాల్లో కలెక్టరేట్లలో కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేయాలని, పోలీస్ తదితర శాఖల అధికారులతో సమన్వయ సమావేశాలు నిర్వహించాలని తెలియచేశారు. ఏ విధమైన సహాయం కావాలన్న రాష్ట్ర రాజధానికి ఏ సమయంలోనైనా సంప్రదించవచ్చునని మంత్రి అన్నారు. ముఖ్యంగా గోదావరి ఉధృతిపై నిరంతరం మానిటరింగ్ చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.

#telangana #rains #ponguleti-srinivas
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe