TN Rains: తమిళనాడులో భారీ వర్షాలు.. నీటమునిగిన గ్రామాలు.. స్కూళ్లకు సెలవు

తమిళనాడు రాష్ట్రాన్ని వర్షాలు వణికిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల జలమయం అయ్యాయి. ఈ నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం స్కూళ్లకు సెలవు ప్రకటించింది. అలాగే భారీ వర్షాల కారణంగా పలు రైళ్లు, విమానాలు రద్దు అయ్యాయి.

New Update
TN Rains: తమిళనాడులో భారీ వర్షాలు.. నీటమునిగిన గ్రామాలు.. స్కూళ్లకు సెలవు

Heavy Rains In Tamil Nadu: తమిళనాడులో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు అక్కడి ప్రజలకు కంటి నిండా నిద్ర లేకుండా చేస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా దక్షిణ తమిళనాడు విలవిలలాడుతోంది. మొన్నటివరకు చెన్నైను (Chennai Floods) అతలాకుతలం చేసిన వర్షాలు..ఇప్పుడు దక్షిణ తమిళనాడును ముంచెత్తుతున్నాయి. తిరునల్వేలి, తూత్తుకుడి, కన్యాకుమారి, తెన్‌కాసి, విరుద్‌నగర్‌ జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలుచోట్ల రోడ్లపై నీరు నిలిచిపోయింది. లోతట్టు ప్రాంతాలు ముంపుకు గురయ్యాయి.

భారీ వర్షాలతో విద్య సంస్థలకు సెలవులు (School Holidays) ప్రకటించింది తమిళనాడు ప్రభుత్వం. అయితే, మరో రెండ్రోజులు తమిళనాడులో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఇక తిరునల్వేలి జిల్లాలో వరదలకు ఓ ఇల్లు కుప్పకూలిపోయింది. ఈ జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో 5 నుంచి 6 అడుగుల మేర వరద నీరు ప్రవహించడంతో ప్రజలు బిల్డింగ్‌లపైనే తలదాచుకుంటున్నారు. మరోవైపు వరదలో చిక్కుకున్న పలువురిని కాపాడి సురక్షిత ప్రాంతాలకు తరలించింది రెస్క్యూ టీమ్.

వర్షాల ఎఫెక్ట్.. రవాణా సంస్థకు అంతరాయం..

వర్షాల ప్రభావంతో రైళ్లు, విమానాలు రద్దయ్యాయి. రైల్వే ట్రాకులపై నీరు నిల్వడంతో పలు రైళ్లను క్యాన్సిల్ చేశారు అధికారులు. ఇక తూత్తుకూడి నుంచి రాకపోకలు సాగించే విమానాలను దారి మళ్లించడంతో పాటు పలు విమానాలను రద్దుచేశారు. ఇక కేర‌ళ‌లోని ఇడుక్కి, తిరువ‌నంత‌పురం జిల్లాల్లో కూడా గ‌డిచిన 24 గంట‌ల్లో భారీ వ‌ర్షపాతం న‌మోదైంది. పంప‌దుంప‌ర‌లో అత్య‌ధికంగా 9 సెం.మీ., వ‌ట్ట‌వ‌డ‌లో 8 సెం.మీ., మైలదుంపుర‌, త‌త్త‌తుమ‌ల‌లో 7 సెం.మీ. చొప్పున వ‌ర్ష‌పాతం న‌మోదైంది. ఇక శబరిమలలోనూ సేమ్ సీన్ రిపీట్ అయింది. రెండ్రోజుల నుంచి భారీ వర్షం కురుస్తోంది. దీంతో వర్షంలోనే దర్శనాలు చేసుకుంటున్నారు భక్తులు. వర్షంతో ఇబ్బందులు పడుతున్నారు.

Advertisment
తాజా కథనాలు