AP News: రేపు విద్యాసంస్థలకు సెలవు.. భారీ వర్షాలపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన! భారీ వర్షాల నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సోమవారం సెలవు ఇవ్వాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. పల్నాడు, ఎన్టీఆర్, గుంటూరు, ప్రకాశం జిల్లాలకు అధికారులు రెడ్ అలెర్ట్ ప్రకటించారు. By srinivas 01 Sep 2024 in ఆంధ్రప్రదేశ్ విజయవాడ New Update షేర్ చేయండి AP News: భారీ వర్షాల నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు అధికార యంత్రాగాన్ని అప్రమత్తం చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సమస్యాత్మక ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలని కలెక్టర్లు, ప్రభుత్వ అధికారులను అదేశించారు. ప్రాణ నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అలాగే ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో అన్ని స్కూళ్లకు సెలవులు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు మొదట సమస్యాత్మక ప్రాంతాల్లో సెలవులు ప్రకటించినప్పటికీ.. వర్షం మరింత పెరగడంతో రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవులు ఇవ్వాలని ఆదేశించారు. దీంతో సోమవారం సెలవు ప్రకటిస్తూ విద్యాశాఖ అనౌన్స్ చేసింది. ఎన్టీఆర్ జిల్లావ్యాప్తంగా విస్తారంగా వానలు పడతున్నాయి. విజయవాడలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. #school-holidays #ap-cm-chandrababu #heavy-rain మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి