భారీ వర్షాలు: కరెంట్ తో జాగ్రత్త.. ప్రజలకు వార్నింగ్ ఇచ్చిన విద్యుత్ సంస్థ ర్షం పడుతున్న సమయంలో విద్యుత్ తీగల కింద, ట్రాన్స్ ఫార్మర్ల పక్కన నిలబడవద్దని చెప్పారు. ఎవరికైనా విద్యుత్ షాక్ తగిలినట్లయితే వారిని కాపాడడానికి పొరపాటున ఐరన్ రాడ్స్ ను వాడకూడదన్నారు. చెక్క లేదా ప్లాస్టిక్‌తో చేసిన వస్తువులను మాత్రమే ఉపయోగించాలి. ముందస్తు అవగాహనతో వర్షా కాలంలో ఎదురయ్యే విద్యుత్ ప్రమాదాలతో.. By E. Chinni 27 Jul 2023 in Scrolling తెలంగాణ New Update షేర్ చేయండి భారీ వర్షాలతో విద్యుత్ ప్రమాదాలు కూడా పొంచి ఉంటాయి. కాస్త అజాగ్రత్తగా లేకుంటే ప్రజలు విద్యుత్ ప్రమాదాల బారిన పడే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ అప్రమత్తమైంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 9 విద్యుత్ సర్కిళ్ల పరిధిలో విద్యుత్ శాఖ అధికారులు ప్రజలను క్షేత్ర స్థాయిలో అప్రమత్తం చేస్తున్నారు. అలాగే వర్షం పడుతున్న సమయంలో విద్యుత్ తీగల కింద, ట్రాన్స్ ఫార్మర్ల పక్కన నిలబడవద్దని చెప్పారు. ఎవరికైనా విద్యుత్ షాక్ తగిలినట్లయితే వారిని కాపాడడానికి పొరపాటున ఐరన్ రాడ్స్ ను వాడకూడదన్నారు. చెక్క లేదా ప్లాస్టిక్‌తో చేసిన వస్తువులను మాత్రమే ఉపయోగించాలి. ముందస్తు అవగాహనతో వర్షా కాలంలో ఎదురయ్యే విద్యుత్ ప్రమాదాలతో సురక్షితంగా ఉండవచ్చు. విద్యుత్ వినియోగదారులతో పాటు ప్రజలు విద్యుత్ ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఈ మేరకు టీఎస్‌ఎస్‌పీడీసీఎల్ పలు సూచనలు జారీ చేసింది. ప్రజలు తీసుకోవాల్సిన జాగత్రలు: -మహిళలు బట్టలు ఆరవేసేందుకు వాడే తీగలు విద్యుత్ తీగలకు తగలకుండా ఉండేలా చూసుకోవాలి. -గోడల నుంచి వర్షపు నీరు దిగుతుంటే వెంటనే మరమ్మతులు చేయించాలి. విద్యుత్ బోర్డులోకి నీరు దిగితే ప్రమాదాలు జరుగుతాయి. -రోడ్ల వెంబడి ఉన్న విద్యుత్ స్తంభాలను తాకే ప్రయత్నం చేయరాదు. -విద్యుత్ సిబ్బంది సైతం జాగ్రత్తలు తీసుకున్న తర్వాతే క్షేత్ర స్థాయిలో మరమ్మతులు చేయాలి. -తెగి పడిన విద్యుత్ తీగలను తాకరాదు. అపార్టుమెంట్ సెల్లార్ లోకి నీరు చేరి విద్యుత్ తీగలు తగిలినా, మీటర్ల దాకా వచ్చినా వెంటనే విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం అందించాలి. -భవనాలపై నుంచి వెళ్లే డిష్, టెలిఫోన్, ఇంటర్నెట్ సేవల తీగల కారణంగా వర్షా కాలంలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. -విద్యుత్ మరమ్మతు పనులు సొంతంగా చేయకూడదు. చిన్న పనైనా, ఎలక్ట్రిషియన్ ను పిలిపించి చేయించాలి. -భవనాల సమీపం నుంచి వెళ్లే తీగలకు ప్లాస్టిక్ తొడుగులు చేయించాలి. -చేతులు తడిగా ఉన్నప్పుడు స్విచ్ లు, ఇతర విద్యుత్ పరికరాలను తాకరాదు. స్విచ్ ఆఫ్ చేయకుండా ప్లగ్ లను బయటకు తీయరాదు. -పిల్లలకు అందనంత ఎత్తులో ప్లగ్ లను ఏర్పాటు చేయాలి. ఇంటి వైరింగ్ కు తప్పనిసరిగా ఎర్తింగ్ వేయాలి. -నూతనంగా నిర్మిస్తున్న భవనాలను నీటితో తడుపుతున్నప్పుడు దగ్గరలో ఉన్న విద్యుత్ వైర్లను,పరికరాలను గమనించాలి. మరోవైపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. రాష్ట్ర చరిత్రలోనే రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. వరదల కారణంగా పలు ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. చాలా గ్రామాలు నీటమునిగాయి. ముఖ్యంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మోరంచపల్లి గ్రామం జలదిగ్భంధం అయింది. ఈ భారీ వర్షాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ లో సమీక్షా సమావేశం నిర్వహించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లోని పరిస్థితిని సీఎస్ శాంతి కుమారి ఎప్పటికప్పుడు సీఎం కేసీఆర్ కి వివరిస్తున్నారు. #electrical-hazards #telangana-news #latest-news #heavy-rains #monsoon మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి