Rain Alert: దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన! రానున్న ఐదు రోజుల్లో మహారాష్ట్ర , కర్ణాటక లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. అలాగే రాబోయే 2 రోజుల్లో భారత దేశంలోని పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కొనసాగే అవకాశాలున్నట్లు ఐఎండీ హెచ్చరించింది. By Bhavana 07 Jun 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Rain Alert: దేశ వ్యాప్తంగా రుతుపవనాలు చాలా వేగంగా విస్తరిస్తున్నాయి. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో వాతావరణం చల్లగా మారిపోయింది. ఇంకా కొన్ని రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో చెరువులు, నదులు పొంగిపోర్లుతున్నాయి. ఈ క్రమంలోనే రానున్న ఐదు రోజుల్లో మహారాష్ట్ర , కర్ణాటక లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు ఐఎండీ వివరించింది. అలాగే రాబోయే 2 రోజుల్లో భారత దేశంలోని పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కొనసాగే అవకాశాలున్నట్లు ఐఎండీ హెచ్చరించింది. గత కొంతకాలంగా వేడితో అల్లాడిపోయిన దేశ ప్రజలు.. వాతావరణం చల్లబడడంతో ప్రజలు చల్ల గాలుల నుంచి ఉపశమనం పొందుతున్నారు. ఈ క్రమంలోనే పలు రాష్ట్రాల్లో గత రెండు మూడు రోజుల నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలో భారీగా వర్షం కురుస్తుంది. Also read: వాటికి ప్రస్తుతానికి విశ్రాంతినిచ్చి…వచ్చే సారికి మొదలు పెట్టండి…ఈవీఎంల గురించి ఈసీ సెటైర్లు! #telangana #rains #bharat #imd మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి