జమ్మూ కశ్మీర్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీనికి తోడు కొండ ప్రాంతాల్లో భారీగా మంచు కూడా కురవడంతో జనజీవనం అస్తవ్యస్థంగా మారింది. భారీ వర్షాల వల్ల పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. బారాముల్లా, కిష్త్వార్, రియాసి జిల్లాలు భారీ వర్షాలకు అతలాకుతలం అయ్యాయి. కిష్త్వార్ జిల్లాలో సుమారు12 ఇళ్లు దెబ్బతిన్నాయి. రాష్ట్రంలో గత నాలుగు రోజులుగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సహాయక బృందాలు అప్రమత్తమయ్యాయని అధికార ప్రతినిధి తెలిపారు. మంగళవారం కూడా కొన్ని ప్రాంతాల్లో మంచు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో ఈరోజు కశ్మీర్‌లో పాఠశాలలను కూడా మూసివేశారు.
Also read: బాబా రామ్‌దేవ్ పతంజలికి మరో పెద్ద షాక్.. వాటి లైసెన్స్ లు క్యాన్సిల్!
అలాగే కశ్మీర్ జరగాల్సిన ప్రభుత్వ జూనియర్ అసిస్టెంట్ పరీక్షను కూడా అధికారులు వాయిదా వేశారు. జమ్ము-శ్రీనగర్ రహదారిలో శిథిలాలు తొలగించే వరకు ఈ రహదారిపై ప్రయాణాలు చేయొద్దని సూచించారు. భారీ వర్షాల నేపథ్యంలో కిష్త్వార్ జిల్లాలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. రియాసిలో దోడా, రాంబన్, గులాబ్‌గఢ్‌లలోని నదులు, వాగుల్లో నలుగురు వ్యక్తులు కొట్టుకుపోవడం కలకలం రేపింది. వాళ్లలో ఇద్దరి మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇళ్లు కూలడం, కొండచరియలు విరిగిపడటంతో 12 చిన్నారులతో సహా మొత్తం 22 మంది గాయాలపాలయ్యారు.
Also read: ఘోర ప్రమాదం..పెళ్లి ఊరేగింపు పై పడిన ట్రక్కు.. 6 గురు మృతి!