Heavy Rains: తెలుగు రాష్ట్రాలకు అతి భారీ వర్ష సూచన..మరో నాలుగు రోజులు!

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారినట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఏపీలోని తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, ఏలూరు, అల్లూరి సీతారామరాజు, జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ అధికారులు వివరించారు.

New Update
Heavy Rains: తెలుగు రాష్ట్రాలకు అతి భారీ వర్ష సూచన..మరో నాలుగు రోజులు!

Heavy Rains: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారింది. ఇది ఉత్తర దిశగా కదులుతూ ఒడిశా, పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరాల్లో సోమవారం నాటికి వాయుగుండంగా మారనున్నట్లు అధికారులు తెలిపారు. ఆ తర్వాత మూడు రోజుల్లో పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ ఉత్తర ఒడిశా, ఝార్ఖండ్, ఉత్తర ఛత్తీస్ గఢ్ మీదుగా ప్రయాణించే అవకాశాలున్నట్లు అధికారులు వివరించారు. దీని ప్రభావంతో ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు, ఆది, సోమవారాల్లో కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, ఏలూరు, అల్లూరి సీతారామరాజు, జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ అధికారులు వివరించారు. ఆదివారం నాడు ఏలూరు, అల్లూరి సీతారామరాజు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, కృష్ణా జిల్లా, డా బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ, అనకాపల్లిలో కొన్ని చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు.. కురిసే అవకాశాలున్నాయి.

విజయవాడ నగరంలో మరోసారి భారీవర్షం కురిసింది. సహాయ కార్యక్రమాలకు అంతరాయం ఏర్పడింది. జక్కంపూడి కాలనీ, అంబాపురం వెళ్లే రూట్లో ఇంకా నీళ్లున్నాయి. కృష్ణా జిల్లాలో విస్తారంగా వానలు పడుతున్నాయి..

తెలంగాణలోనూ వచ్చే నాలుగు రోజులు భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదివారం తేలికపాటినుంచి మోస్తరు వర్షం చాలాచోట్ల కురిసే అవకాశం ఉందని తెలిపింది. మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, కొమురం భీం ఆసిఫాబాద్, , భద్రాద్రి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు, గంటకు 40 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

సోమవారం కూడా పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశాలున్నట్లు ఐఎండీ తెలిపింది. మంగళవారం తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు నంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వివరించింది. బుధవారం వరకు వానలు కురిసే అవకాశాలున్నట్లు వాతావరణశాఖ తెలిపింది.

Also Read: విజయవాడలో మళ్లీ భారీ వర్షం.. అప్రమత్తమైన ఏపీ సర్కార్!

Advertisment
తాజా కథనాలు