/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/rain-jpg.webp)
Telangana : భానుడి భగభగల నుంచి ప్రజలు ఉపశమనం పొందుతున్నారు. తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షం(HeavyRain) కురుస్తోంది. ఏటూరునాగారంలో దాదాపు గంట నుంచి కుండపోత వాన పడుతోంది. వరంగల్(Warangal), జనగాం, హనుమకొండ, ములుగులోనూ వర్షాలు కురుస్తున్నాయి.
Also Read: కేంద్ర పాలిత ప్రాంతంగా హైదరాబాద్.. కుండ బద్దలు కొట్టిన కేంద్ర మంత్రి!
మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, నాగర్‌కర్నూల్, భూపాలపల్లిలో జల్లులు పడుతున్నారు. తాజా వర్షాలతో ఉష్ణోగ్రతల్లో స్వల్ప తగ్గుదల కనిపిస్తోంది. అంతేకాకుండా, రేపటి నుంచి రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ(Department Of Meteorology) వెల్లడించింది.
అటు ఏపీలోనూ ఎండ తీవ్రతకు విలవిలలాడుతున్న ప్రజలకు అమరావతి వాతావరణ శాఖ శుభవార్త తెలిపింది. ఈ నెల 7న రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పల్నాడు, చిత్తూరు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. మిగతా చోట్ల తేలికపాటి వానలు పడతాయని వెల్లడించింది.