Telangana : రాష్ట్రంలో మరో రెండు రోజులు భారీ వర్షాలు..ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్! తెలంగాణలో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. హైదరాబాద్,ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్,కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. By Bhavana 09 Sep 2024 in తెలంగాణ నిజామాబాద్ New Update షేర్ చేయండి Heavy Rains : తెలంగాణ (Telangana) లో రానున్న రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ (IMD) హెచ్చరికలు జారీ చేసింది. సోమవారం హైదరాబాద్ సహా ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్,కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ మేరకు ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. పెద్దపల్లి, సూర్యాపేట, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, ఆదిలాబాద్, జగిత్యాల, కరీంనగర్, జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. గంటలకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, ఈదురుగాలులు వీస్తాయని వాతావరణశాఖ తెలిపింది. మంగళవారం కుమ్రంభీం ఆసిఫాబాద్ (Kumuram Bheem Asifabad), మంచిర్యాల జిల్లా (Mancherial District) ల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. బుధవారం మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు , కుమ్రంభీం ఆసిఫాబాద్, జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. గురువారం మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. Also Read: పాఠశాలలకు మరోసారి సెలవులు ప్రకటించిన ప్రభుత్వం #telangana #hyderabad #heavy-rains #imd మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి