AAP: శుక్రవారం ఢిల్లీ (Delhi) నగరంలో నిరసన తెలిపేందుకు ఆప్ (AAP) కార్యకర్తలు సిద్దమైన నేపథ్యంలో నగరంలో భారీగా పోలీసులు(Police) , పారా బలగాలు (Para Forces) మోహరించాయి. చండీగఢ్ మేయర్ (Chandighad Mayer Elections) ఎన్నికల్లో ఓడిపోయిన తరువాత ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులు ఢిల్లీలో నిరసన (Protest) కార్యక్రమం చేపట్టేందుకు సిద్దమయ్యారు.
దీంతో ఢిల్లీ పోలీసులు శుక్రవారం నాడు ఢిల్లీ భద్రతను కట్టుదిట్టం చేశారు. తమ పార్టీకి మేయర్ ఎన్నికల్లో అన్యాయం జరిగిందని ఆప్ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నిరసన కార్యక్రమంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కూడా పాల్గొననున్నట్లు సమాచారం.
తాము నిరసన కార్యక్రమానికి అనుమతిని ఇవ్వము అని పోలీసులు చెప్పినప్పటికీ కూడా నిరసన కారులు, మద్దతుదారులు ఢిల్లీ నగరానికి భారీగా చేరుకుంటుండడంతో వారిని నిలువరించేందుకు సుమారు వెయ్యి మంది పోలీసులు, పారామిలటరీ సిబ్బంది ఢిల్లీ నగరానికి చేరుకున్నారు.
ఢిల్లీ కి వచ్చిన వారిలో సీనియర్ పోలీసు అధికారులు కూడా ఉన్నారు. సుమారు ఎనిమిది కంపెనీల నుంచి పారా మిలటరీ బలగాలను రాజధాని నగరానికి తీసుకుని వచ్చారు. సెంట్రల్ ఢిల్లీలోని ఐటీఓ ( ITO) ప్రాంతానికి సమీపంలోని డీడీయూ (DDU) మార్గ్‌లోని బీజేపీ ప్రధాన కార్యాలయం వెలుపల నిరసనలు ప్లాన్ చేసినట్లు ఆప్ (AAP) తెలిపింది.
ఈ క్రమంలో ఆప్ ప్రధాన కార్యలయంతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో నిరసన కార్యక్రమాలు చేపడితే దాడులకు వెనుకడబోమని బీజేపీ వివరించింది. నిరసన కార్యక్రమాలు చేపట్టే ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ లు అవుతుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
నిరసన కార్యక్రమాలను నిలువరించడానికి కొన్ని ప్రాంతాల్లో పోలీసులు హెచ్చరికలు జారీ చేయడంతో పాటు రహదారులను కూడా బంధించినట్లు తెలిపారు. నిరసన కారులు ఎక్కడ ఆందోళనలు చేసి రెచ్చిపోకుండా సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలగకుండా దీన్ దయాళ్ ఉపాధ్యాయ మార్గ్ నుంచి ట్రాఫిక్‌ను మళ్లించనున్నట్లు పోలీసులు తెలిపారు.
మంగళవారం జరిగిన చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో కాంగ్రెస్, ఆప్‌లకు గట్టి ఎదురుదెబ్బ తగిలి బీజేపీ విజయం సాధించింది.
Also read: జార్ఖండ్ ముఖ్యమంత్రిగా చంపై సోరెన్ నేడు ప్రమాణ స్వీకారం!