Delhi Airport: ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో భారీగా బంగారం పట్టివేత.. ఇద్దరు అరెస్ట్

ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో భారీగా బంగారాన్ని అధికారులు పట్టుకున్నారు. 1.92 కోట్ల విలువ చేస్తే రెండు కిలోల బంగారం సీజ్ చేశారు. బంగారు ఆభరణాలను లగేజీ బ్యాగులో దాచి తరలించే యత్నం చేసిన ఇద్దరు విదేశీ ప్రయాణీకులను అరెస్టు చేశారు.

Delhi Airport: ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో భారీగా బంగారం పట్టివేత.. ఇద్దరు అరెస్ట్
New Update

Delhi Airport: ఢిల్లీ అంత‌ర్జాతీయ విమానాశ్రయంలో క‌స్టమ్స్ అధికారులు తనిఖీలు చేశారు. అక్రమంగా తరలిస్తున్న సుమారు 3353 గ్రాముల బంగారాన్ని సీజ్ చేశారు. సీజ్ చేసిన బంగారం విలువ రూ.1.92 కోట్ల వ‌ర‌కు ఉంటుందని అధికారులు తెలిపారు. విదేశీ ప్రయాణీకులు బంగారాన్ని పేస్టుగా మార్చి లగేజ్ బ్యాగ్‌లో తరలించే యత్నం చేశారు. విషయం తెలుసుకున్న అధికారులు తనిఖీలు చేపట్టి ప్లాన్‌ని బట్టబయల్‌ చేశారు. దుబాయ్ నుంచి తీసుకొచ్చిన బంగారాన్ని ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌ లోని వాష్‌రూమ్ దగ్గర మరో వ్యక్తికి అప్పగిస్తుండగా స్వాధీనం చేస్తున్నారు కస్టమ్స్ అధికారులు.

స్మగ్లర్లు క‌స్టమ్స్ అధికారుల నుంచి బురుడి కొట్టించ‌డానికి బంగారాన్ని వివిధ మార్గాల ద్వారా ర‌వాణా చేసేందుకు ప్రయ‌త్నాలు చేస్తున్నారు. అయితే.. కార్గో ఎయిర్‌లో అత్యాధునిక స్కానింగ్‌తో డీఆర్ఐ అధికారులు త‌నిఖీలు చేశారు. ఈ స్కానింగ్‌లో అక్రమంగా తెస్తున్న బంగారం గుట్టు బ‌య‌ట‌ప‌డింది. ఈ ఘటనపై అక్రమ బంగారం స‌ర‌ఫ‌రా కేసును న‌మోదు చేశారు. ఇద్దరు విదేశీ ప్రయాణీకులతో పాటు మరో ఇద్దరిని కస్టమ్స్  అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నలుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ఇది కూడా చదవండి: అనంతపురంలో దారుణం.. మృతదేహంతోనే అంత దూరం ప్రయాణం

#gold #delhi-airport
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe