Heavy Floods: వర్షాలు.. వరదలతో ఉత్తరాది ఉక్కిరిబిక్కిరి

ఇండియాలోని చాలా రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఢిల్లీ, అహ్మదాబాద్‌ లాంటి పట్టణాలు వరద నీటిని తట్టుకోలేక అల్లాడుతున్నాయి. అటు అస్సాం వరదలకు అల్లకల్లోలంగా మారింది. ఇటు ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌లోని పలు ప్రాంతాలు నీట మునుగుతున్నాయి.

Heavy Floods: వర్షాలు.. వరదలతో ఉత్తరాది ఉక్కిరిబిక్కిరి
New Update

Rains: కార్లు కొట్టుకుపోతున్నాయి.. రోడ్లకు గుంతలు పడుతున్నాయి.. పాత భవనాలు నేలకొరుగుతున్నాయి.. లక్షల మంది నిరాశ్రయులవుతున్నారు.. ఇండియాలోని చాలా రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా ఢిల్లీ, అహ్మదాబాద్‌ లాంటి పట్టణాలు వరద నీటిని తట్టుకోలేక అల్లాడుతున్నాయి. ఈ పట్టణాల్లో ఎక్కడ చూసినా వరద నీరే కనిపిస్తోంది. అటు అస్సాం వరదలకు అల్లకల్లోలంగా మారింది. ఇటు ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌లోని పలు ప్రాంతాలు నీట మునుగుతున్నాయి. రుతుపవనాల ఎంట్రీ ఇచ్చిన తర్వాత నుంచి దేశంలోని చాలా రాష్ట్రాలు ఇదే పరిస్థితిని ఫేస్ చేస్తుండడం ఆందోళన కలిగిస్తోంది.

గుజరాత్‌

గుజరాత్‌లోని (Gujarat) చాలా జిల్లాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. సూరత్‌లో 39 చెట్లు నేలకూలడంతో పాటు పలు ప్రాంతాల్లో నీటి ఎద్దడి నెలకొంది. నవ్‌సారి జిల్లాలో రెండు భవనాలు కుప్పకూలాయి. భారీ వర్షాలు, వరదలు కారణంగా జరిగిన వేరువేరు ఘటనల్లో చనిపోయిన వారి సంఖ్య నాలుగుకు చేరింది. వల్సాద్ జిల్లా-వాపిలోని చర్వాడ గ్రామంలో ముగ్గురు పిల్లలు మరణించారు. వారి ఇంటి వెనుక ఉన్న గొయ్యిలో పడిపోయి చనిపోయారు. సూరత్‌లో ఓ ఆటోరిక్షాపై చెట్టు పడిపోవడంతో 42 ఏళ్ల వ్యక్తి మరణించాడు. వర్షం కారణంగా బార్డోలిలోని డీఎం నగర్ సొసైటీ నీటిలో మునిగిపోయింది. అటు గుజరాత్‌ రాజధాని అహ్మదాబాద్‌లో భారీ వర్షానికి రోడ్లపై భారీగా గుంతలు పడ్డాయి. రోడ్డు మధ్యలో వాటర్‌ ఫాల్‌ ఏదైనా ఉందా అనే లెవల్‌లో ఈ గుంతలు కనిపిస్తున్నాయి.

ఉత్తరప్రదేశ్‌

అటు ఉత్తరప్రదేశ్‌లోని (Uttar Pradesh) పలు ప్రాంతాల్లోనూ భారీగా వర్షాలు కురుస్తున్నాయి. అయోధ్య సహా అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటే ఇబ్బందిగా మారింది. డ్రైనేజీ వ్యవస్థ దారుణంగా ఉండడంతో రోడ్లపైనే భారీగా నీరు నిలిచిపోతున్నాయి. అయోధ్య రైల్వేస్టేషన్ వద్ద మోకాళ్ల లోతు నీటితో నిండిపోయాయి. ప్రయాణికులు బయటకు వెళ్లేందుకు, లోపలికి వెళ్లేందుకు నానాతంటాలు పడాల్సి వస్తోంది. రోడ్డు విస్తరణ వల్ల రైల్వేస్టేషన్ మార్గంలో ఎక్కడికక్కడ చెత్తాచెదారం ఉండడంతో ఈ సమస్య మరింత తీవ్రమైంది.

publive-image

ఉత్తరాఖండ్‌

అటు ఉత్తరాఖండ్‌లోని (Uttarakhand) పలు ప్రాంతాల్లో పలు పరిస్థితి భయంకరంగా కనిపిస్తోంది. కార్లు కొట్టుకుపోతున్నాయి.. బస్సులు కదల లేనంత లోతుకు మునిగిపోతున్నాయి. రుతుపవనాలు ప్రవేశించిన తర్వాత కురిసిన తొలి వర్షమే ఇంతటి బీభత్సం సృష్టించింది. ఇక రాష్ట్రంలో కురుస్తున్న వర్షాల కారణంగా నదుల నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. కొండ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో గంగా నదితో పాటు రాష్ట్రంలోని అన్ని ఉపనదుల నీటిమట్టం పెరిగింది. అటు హరిద్వార్‌లో కురిసిన వర్షానికి వాహనాలు గడ్డివాములా కొట్టుకుపోయాయి. భారీ వర్షాలకు రోడ్లపై ఎక్కడ చూసినా నీరే కనిపిస్తోంది.

అస్సాం

ఇటు అస్సాంలో (Assam) వరద పరిస్థితి రోజురోజుకు మరింత దిగజారుతోంది. అస్సాంలోని 12 జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు 2,62,000 మందికి పైగా ప్రజలు ప్రభావితమయ్యారు. దాదాపు 670 గ్రామాల్లో వరద నీరు భారీగా ప్రవహిస్తోంది. ఇక బ్రహ్మపుత్ర సహా ఐదు ప్రధాన నదులు ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. నిజానికి 2024 ప్రారంభం నుంచే అస్సాంలో ఇలాంటి దుస్థితే కనిపిస్తోంది. 2024లో వరదలు, తుఫానులు, కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో చనిపోయిన వారి సంఖ్య 44కు చేరింది.

మహారాష్ట్ర

అటు మహారాష్ట్ర (Maharashtra), ఢిల్లీ (Delhi) సహా ఇండియాలోని చాలా ప్రాంతాల్లో వరుణుడు బీభత్సం సృష్టిస్తున్నాడు. దేశ రాజధానిలో రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. భారీ వర్షానికి ఢిల్లీ ఎయిర్‌పోర్టు టెర్మినల్‌-1 పైకప్పు కూలి ఒకరు మరణించారు. 88ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా జూన్‌లో అత్యధిక వర్షపాతం నమోదైంది. ఇక నగరాల్లో వరదలు సంభవించిన ప్రతీసారి విషాద ఘటనలు జరుగుతూనే ఉంటాయి.. డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేకపోవడం వల్లే ఇలా జరుగుతుందని నిపుణులు చెబుతుంటారు.

Also Read: AP: రాష్ట్రంలో పండగ వాతావరణం.. చంద్రబాబు ఇచ్చిన హామీని నెరవేర్చారు: హోం మంత్రి అనిత - Rtvlive.com

#gujarat #uttarakhand-floods #uttar-pradesh #heavy-rains
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe