Heat Waves : రానున్న ఐదు రోజులు వడగాలులు..బయటకు రావొద్దంటున్న అధికారులు! తెలంగాణతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా వచ్చే ఐదు రోజుల పాటు తీవ్రమైన వడగాలులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఈ క్రమంలో కొన్ని జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. అంతేకాకుండా అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావొద్దని హెచ్చరించింది By Bhavana 27 Apr 2024 in ఆంధ్రప్రదేశ్ తెలంగాణ New Update షేర్ చేయండి Telangana : తెలంగాణతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా వచ్చే ఐదు రోజుల పాటు తీవ్రమైన వడగాలులు(Heat Waves) వీస్తాయని హైదరాబాద్(Hyderabad) వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఈ క్రమంలో కొన్ని జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. అంతేకాకుండా అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావొద్దని హెచ్చరించింది. రాష్ట్రవ్యాప్తంగా గత కొన్ని రోజుల నుంచి పొడి వాతావరణం ఏర్పడుతుండడంతో ఉష్ణోగ్రతుల మరింత పెరిగే అవకాశాలున్నట్లు అధికారులు పేర్కొన్నారు. అదే సమయంలో ఆదివారం నుంచి సోమవారం వరకు పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణకేంద్ర శాఖ(Department of Meteorology) వివరించింది. శనివారం మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో వడగాలులు వీస్తాయంటూ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. 28న నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాలకు వడగాలులు వీస్తాయంటూ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేయగా.. పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ ఇష్యూ చేసింది. అలాగే, ఆదివారం కుమ్రంభీం, ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. సోమవారం నాడు నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాలు, 30న కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలకు వడగాలలు వీస్తాయని చెప్పింది. సోమవారం ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలతో పాటు భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని చెప్పింది. భూపాలపల్లి, ములుగు, నల్గొండ, సూర్యాపేట, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అవకాశాలు కురిసే ఈదురుగాలులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. Also read: కేజ్రీవాల్ రాజీనామా చేయకపోవడంతో హైకోర్టు కీలక వ్యాఖ్యలు! #telangana #ap #imd #heat-waves #summer #temperatures మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి