Weather: దేశంలో కొన్ని రాష్ట్రాల్లో హీట్ వేవ్..ఐఎండీ హెచ్చరిక

దేశంలో విచిత్ర పరిస్థితులు నెలకొన్నాయి. కొన్నిచోట్ల మాన్సూన్ ఎంటర్ అయి వర్షాలు పడుతుంటే..మరికొన్ని చోట్ల ఎండలు దంచేస్తున్నాయి. తాజాగా కొన్ని రాష్ట్రాల్లో రాబోయే రోజుల్లో హీట్‌ వేవ్‌ ఉంటుందని ఐఎండీ హెచ్చరించింది.

Weather: దేశంలో కొన్ని రాష్ట్రాల్లో హీట్ వేవ్..ఐఎండీ హెచ్చరిక
New Update

Heat Wave: సౌత్‌లో వర్షాలు పడుతుంటే...నార్త్‌లో మాత్రం వేడి చంపేస్తోంది. ఢిల్లీ, పంజాబ్, చండీఘడ్, హర్యానాల్లో ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువగా ఉంటున్నాయి. దీంతోపాటూ ఈ రాష్ట్రాల్లో హీట్‌ వేవ్‌ ఉంటుందని చెబుతోంది భారత వాతావరణశాఖ. జూన్ 22 నుంచి జూన్ 25 వరకు పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో హీట్‌వేవ్ పరిస్థితులు చాలా ఎక్కువగా ఉంటాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. జూన్ 24, 25 తేదీల్లో పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీలో కూడా హీట్‌వేవ్ పరిస్థితులు ఉండే అవకాశం ఉందని తెలిపింది. దాని తర్వాత వేడిగాలులు తగ్గుముఖం పడతాయని తెలిపింది.

మరోవైపు తెలుగు రాష్ట్రాలతో పాటూ పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది.

గోవా, మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక, తమిళనాడు, గుజరాత్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ మరియు ఛత్తీస్‌గఢ్‌తో సహా రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది. ఇక పశ్చిమ బెంగాల్, సిక్కిం, అస్సాం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, బీహార్, ఒడిశా, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్‌లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

Also Read:NEET: నీట్ పీజీ పరీక్ష వాయిదా..

#india #sun #north #heat-wave
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe