Hearing on Chandrababu's Bail Cancellation : స్కిల్ స్కాం కేసులో టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు (Chandra Babu) బెయిల్ రద్దు చేయాలంటూ సీఐడీ (CID) దాఖలు చేసిన పిటిషన్ పై ఈ రోజు సుప్రీం కోర్టులో (Supreme Court) జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం విచారణ చేపట్టయింది. స్కిల్ స్కాం కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలన్న సీఐడీ పిటిషన్ పై గత విచారణలో నోటీసులు సుప్రీంకోర్టు ఇచ్చింది. ఈ కేసుకు సంబంధించి పబ్లిక్ కామెంట్స్ చేయవద్దని బాబుకు షరతులు విడిచింది కోర్టు. విచారణ అనంతరం పిటిషన్ పై విచారణ జనవరి 19కి వాయిదా వేసింది.
ALSO READ: నా ఫోన్ హ్యాక్ చేశారు.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు
రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి చంద్రబాబు లేఖ..
ఏపీలో అధికారిక పార్టీ ఓట్ల అవకతవకలకు పాల్పడుతోందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. ఎలక్టోరల్ మాన్యువల్ 2023 ప్రకారం మార్పులు జరగట్లేదని అన్నారు. క్షుణ్ణంగా పరిశీలించి డబుల్ ఎంట్రీలను తొలగించాలని కోరారు. ఇప్పటికీ డబుల్ ఎంట్రీలు గుర్తిస్తూనే ఉన్నారు.. ఓటరు జాబితాలో ఇప్పటికీ మరణించిన వారి ఓట్లున్నాయని పేర్కొన్నారు. ఇష్టానుసారం ప్రతిపక్షాల ఓట్లను తొలగిస్తున్నారని లేఖలో తెలిపారు. ఓట్లను తొలగించాలంటే కచ్చితమైన ఆధారాలు చూపించాలని డిమాండ్ చేశారు.
ALSO READ: కవిత, కేటీఆర్ జైలుకే.. సుఖేష్ చంద్రశేఖర్ బహిరంగ లేఖ