Barrelakka Sirisha: తెలంగాణలోని కొల్లాపూర్ నియోజకవర్గ స్వంతంత్ర అభ్యర్థి బర్రెలక్క (శిరీష) తనకు భద్రతా కల్పించాలంటూ తెలంగాణ హైకోర్టును (High Court) అశ్రయించిన సంగతి తెలిసిందే. కాగా గతంలో జరిగిన దాడి నేపథ్యంలో తనకు 2ప్లస్2 గన్‌మెన్లతో భద్రత కల్పించాలని కోరుతూ వేసిన పిటీషన్ ను స్వీకరించిన హైకోర్టు శుక్రవారం దీనిపై విచారణ జరపనుంది. అలాగే బర్రెలక్క భద్రతపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని హైకోర్టు కోరింది.
ఇక రెండు రోజుల క్రితం తనపై జరిగిన దాడిని ఖండిస్తూ.. తనకు భద్రతను కల్పించాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు శిరీష. ఈ క్రమంలోనే ఆమెకు మద్దతుగా అంతర్జాతీయ న్యాయవాదుల సంఘం నాయకులు కావేట శ్రీనివాసరావు, కరణం రాజేశ్, ఆదిత్య దొడ్డల అండగా ఉంటామని ప్రకటించారు. దాడికి పాల్పడిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని, బర్రెలక్కకు రక్షణ కల్పించాలని ఎస్పీని కోరుతామన్నారు. ఇటీవల జరిగిన దాడి నేపథ్యంలో తనకు 2ప్లస్2 గన్‌మెన్లతో భద్రత కల్పించాలని కోరుతూ బర్రెలక్క (కర్నె శిరీష) హైకోర్టులో ఫిటిషన్ దాఖలు చేశారు. ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ హోంశాఖ ప్రధాన కార్యదర్శి, చీఫ్ ఎలక్షన్ కమిషన్, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు ఆదేశాలు జారీచేయాల్సిందిగా కోర్టును కోరారు. దీనిపై శుక్రవారం విచారణ చేపట్టనుంది న్యాయస్థానం. ఒకవేళ కోర్టు సానుకూలంగా స్పందించి ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకూ ఈమెకు భద్రత కల్పించాలని తీర్పు వెలువరిస్తే రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశ వ్యాప్తంగా ఇదొక సంచలనమే.
Also read :కేసీఆర్ కు కిషన్ రెడ్డి మరో బహిరంగ లేఖ.. ఎవరిమాట వినడంటూ సెటైర్లు
అలాగే శిరీష (Barrelakka Sirisha) మీడియాతో మాట్లాడుతూ.. తాను ఓట్లు చీల్చుతాననే భయంతోనే కొందరు దాడులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 'నా తమ్ముడిపై దాడికి పాల్పడింది ఎవరో, వారు ఏ పార్టీకి చెందిన వారో నాకు తెలుసు. కానీ వాళ్ల వివరాలు ఇప్పుడు వెల్లడించను. ప్రాణం పోయినా ఈ పోరాటంలో వెనుకడుగు వేయను. నేను ఇప్పుడు ఒక్క అడుగు వెనక్కి వేస్తే.. భవిష్యత్తులో 1000 అడుగులు వెనక్కి వేసినదాన్ని అవుతాను. యవతకు ఇది తప్పుడు సంకేతం ఇస్తుంది. నాకు మద్దతుగా ప్రచారం చేస్తున్న మధు అనే యువకుడిని సాఫ్ట్‌వేర్ ఉద్యోగం నుంచి తొలగించారు. తనకు అండగా నిలుస్తున్న వారిని బెదిరిస్తున్నారు. ఇలాంటివి ఎన్ని సంఘటనలు ఎదరురైనా నేను దేనికీ భయపడను' అంటూ పలు ఆరోపణలు చేశారు శిరీష.