Health Tips: వెంటాడుతున్న మానసిక సమస్యలు.. మహిళల కంటే పురుషుల్లోనే ఎక్కువ

ఇటీవల కాలంలో మానసిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. మెంటల్ హెల్త్ ప్రోగ్రాం స్క్రీనింగ్ పరీక్షల్లో ఈ విషయాలు బయటపడ్డాయి. అయితే ఈ పరీక్షలు చేయడంతో మానసిక సమస్యలతో వేలాది మంది బాధపడుతున్నట్లు తేలింది. స్క్రిజోఫ్రీనియా, డిప్రెషన్‌, మూడ్‌ డిజార్డర్స్‌ వంటి మానసిక జబ్బులతో చాలామంది సతమతమవుతున్నారు. ప్రతి చిన్న విషయానికి డీలా పడిపోవడం, తర్వాత ఏం జరుగుతుందోనని భయపడిపోవడం, ఆందోళన వంటి మానసిక సమస్యలకు గురవుతున్నారు.

Health Tips: వెంటాడుతున్న మానసిక సమస్యలు.. మహిళల కంటే పురుషుల్లోనే ఎక్కువ
New Update

ఈ మధ్యకాలంలో చాలామందిని దీర్ఘకాలిక వ్యాధులతో పాటు మానసిక సమస్యలు వెంటాడుతున్నాయి. ఇప్పటిదాకా ఈ మానసిక రుగ్మతలు పట్టణాలు, నగరాలకు మాత్రమే పరిమితమై ఉండేవి. కానీ ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో విస్తరించడం ఆందోళన కలిగిస్తోంది. గతంతో పోల్చుకుంటే ఇటీవల కాలంలో మానసిక ఇబ్బందులకు గురవుతున్న వారి సంఖ్య పెరిగిందని వైద్యులు చెబుతున్నారు. మెంటల్ హెల్త్ ప్రోగ్రాం స్క్రీనింగ్ పరీక్షల్లో ఈ విషయాలు బయటపడినట్లు తెలిపారు. అయితే ఈ పరీక్షలు చేయడంతో మానసిక సమస్యలతో వేలాది మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. స్క్రిజోఫ్రీనియా, డిప్రెషన్‌, మూడ్‌ డిజార్డర్స్‌ వంటి మానసిక జబ్బులతో సతమతమవుతున్నారని పేర్కొన్నారు. అయితే వీటిని సగటున చూసినట్లైతే మహిళల్లో కంటే పురుషుల్లోనే ఎక్కవమంది ఈ సమస్యలకు గురవుతున్నారని వెల్లడైనట్లు స్పష్టం చేశారు.

మరోవిషయం ఏటంటే స్కిజోఫ్రీనియా (మనో వైకల్యం), యాంగ్జైటీ (ఆందోళన) అనేవి ఎక్కువ మందిలో కనిపిస్తున్నాయి. ప్రతి చిన్న విషయానికి డీలా పడిపోవడం, తర్వాత ఏం జరుగుతుందోనని భయపడిపోవడం, ఆందోళన వంటి జబ్బులతో అనేక ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాదు వీటి పరిష్కారం కోసం వైద్యుల వద్దకు చికిత్సకు వెళ్లాలంటే కూడా ఆత్మన్యూనతగా భావిస్తున్నారు. ఇలాంటి మానసిక వ్యాధులు దీర్ఘకాలికంగా ఉండటం వల్ల.. చేసే వృత్తిపరంగా కూడా అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఇండోనేషియలో స్కిజోఫ్రెనియా కేసులు ఎక్కువగా ఉన్నట్లు ఓ నివేదికలో బయటపడింది. ఇక మనదేశంలో దాదాపు 30 లక్షల కంటే ఎక్కువమంది స్కిజోఫ్రెనియాతో బాధపడుతున్నట్లు తేలింది. పని ఒత్తిడి ఉండటం, చిన్నచిన్న విషయాలకే ఆందోళన చెందడం వంటివన్నీ కూడా మానిసిక ఆరోగ్యంపై తీవ్రంగా ప్రభావాన్ని చూపిస్తాయి.

Also read: మీలో ఈ లక్షణాలు కనిపిస్తే..మీకు షుగర్ ఉన్నట్లేనట..!!

ఉమ్మడి కుటుంబాల్లో గొడవలు జరిగి చిన్న కుటుంబాల వల్ల ఒంటరిగా భావించడం, ఆరేళ్ల నుంచే సామాజిక మాధ్యమాల ప్రభావం ఉండటం, మద్యపానం, ఇతర మత్తుపదార్థాల వల్ల యువకుల్లో మానసిక రుగ్మతలకు దారితీయడం, ప్రైవేటు లేదా కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఒత్తిడి ఉండటం మానసిక రుగ్మతలకు ప్రధాన కారణాలుగా తెలుస్తున్నాయి. అలాగే సాఫ్ట్‌వేర్, బ్యాంకింగ్ వంటి ఉద్యోగాల్లో పని ఒత్తిడి ఎక్కువగా ఉండటం, వ్యాయమం చేయకపోవడం వల్ల కూడా చిన్న వయసులోనే జీవనశైలికి సంబంధించిన వ్యాధులకు గురవుతున్నారు.

ఒత్తిడిని ఇలా అధిగమించండి

మనుషులు వివిధ రకాల కారణాలతో అనేక ఒత్తిడులకు లోనవుతుంటారు. అవి శారీరక, మానసిక ఒత్తిడి అని రెండు రకాలుగా ఉంటాయి. మనం ఆరోగ్యం కాపాడుకున్నట్లైతే శారీరక ఒత్తిడిని జయించవచ్చు. మితంగా ఆహారం తీసుకోవడం, ప్రతిరోజూ తప్పకుండా వ్యాయామం, యోగా చేయడం, అలాగే వృత్తిపరమైన శిక్షణ వల్ల మానసిక ఒత్తిడిని అధిగమించొచ్చు. అయితే వ్యాపారంలో సరైన లాభాలు రాకపోవడం వల్ల, పనిభారం పెరగడం, పదోన్నతి లేని ఉద్యోగంలో ఒత్తిడి అనేది పెరుగుతుంది. చేసే పనిని ప్రేమించినప్పుడు ఈ సమస్య నుంచి బయటపడొచ్చు. వృత్తిపరంగా గెలుపు, ఓటములు అనేవి ఉంటాయి. ఓటమిని సవాల్‌గా స్వీకరించి విశ్లేశించుకంటూ ముందుకెళ్లాలి. స్ఫూర్తిదాయక వ్యక్తుల మధ్య కొద్దిసేపు గడపడం, మంచి పుస్తకాలు చదవడం, అలాగే అనవసరమైన ఆలోచనలు, చికాకులను దూరం పెడుతూ సంతోషమైన జీవితాన్ని గడపేందుకు ప్రయత్నించాలి. అలా చేయడం వల్ల మానసిక రుగ్మతల నుంచి బయటపడే అవకాశాలు ఉన్నాయి.

#health-tips #depression #health-news
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe