Health: బీపీ, కోపం వేరువేరు బాసూ... ముందు ఈ తేడాలు తెలుసుకో..! చాలా మంది హై బీపీ, కోపం రెండు ఒక్కటే అనుకుంటారు. కానీ కాదు. గుండెనుంచి శరీరం మొత్తానికి రక్తాన్ని చేరవేసే రక్త నాళాలద్వారా పెరిగే ఒత్తిడినే రక్తపోటు అంటారు. ధమనులలో ఒత్తిడి ఉండవలసిన దానికంటే ఎక్కువగా ఉంటే అది హై బీపీ. ఇటు కోపం అన్నది జస్ట్ భావోద్వేగాలకు సంబంధించిన విషయం. By Trinath 14 Nov 2023 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Difference between blood pressure and anger: మనం ఎవర్నినైనా గట్టిగా మందలిస్తే.. ఎందుకా బీపీ(బ్లడ్ ప్రెజర్) అని అంటుంటారు. ఆవేశంలో మాట్లిడితే వీడికి బీపీ ఎక్కువ అంటారు. గట్టిగా తిట్టినా, అరిచినా బీపీ తగ్గించుకో అని ఉచిత సలహా ఇస్తుంటారు. అయితే ఇవన్ని బీపీ లక్ష్యణాలు కాదు. బీపీ వేరు కోపం వేరు. ఈ రెండిటికి డిఫరెన్స్ ఉంటుంది. బీపీని తెలుగులో రక్తపోటు అంటారు. హై బీపీ.. లో బీపీ.. ఇలా రకాలు ఉంటాయి. సాధారణ రక్తపోటు 120 ఎమ్ఎమ్‌హెచ్‌జీ సిస్టోలీక్ లేదా 80 ఎమ్ఎమ్‌హెచ్‌జీ డైస్టోలిక్‌గా ఉంటుంది. అధిక రక్తపోటుకు ప్రధాన కారణం తెలియదు కానీ ఇది ధూమపానం, మద్యపానం, అధికంగా సోడియం తీసుకోవడం, శారీరక శ్రమ లేకపోవడం, ఒత్తిడి మొదలైన అనేక అంశాలు దీనిపై ప్రభావం చూపుతాయి. ఇటు కోపం మాత్రం భావోద్వేగాలకు సంబంధించిన విషయం. చాలా మంది కోపాన్ని హై బీపీ అని అనుకుంటారు. అందుకే ఈ రెండిటి మధ్య తేడా తెలుసుకోవడం ముఖ్యం. రక్తపోటు అనేది శారీరక కొలత, ఇది ధమనుల గోడలపై రక్తం ప్రయోగించే శక్తిని సూచిస్తుంది. కోపం అనేది ఒక భావోద్వేగ ప్రతిస్పందన, ఇది అసంతృప్తి, చికాకు లేదా శత్రుత్వ భావాలను కలిగి ఉంటుంది. ప్రతీకాత్మక చిత్రం(Image Credit/Unsplash) బీపీని మిల్లీమీటర్లలో కొలుస్తారు. కోపం అన్నది సబ్జెక్టివ్. ఇది కోలవడం కుదరదు. అధిక రక్తపోటు గుండె జబ్బులు, స్ట్రోక్, మూత్రపిండాల సమస్యలతో సహా తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. అటు దీర్ఘకాలిక కోపం వల్ల కూడా ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఇది ఒత్తిడిని పెంచుతుంది. గుండె ఆరోగ్యంతో సహా మొత్తం హెల్త్‌ను ప్రభావితం చేస్తుంది. అయితే దీన్ని అధిక రక్తపోటు అని అనకూడదు. ప్రతీకాత్మక చిత్రం(Image Credit/Unsplash) లో బీపీ లేదా హై బీపీకి వయస్సు, జన్యుశాస్త్రం, ఆహారం, శారీరక శ్రమ లాంటి కారణాలు ఉంటాయి. అటు కోపం వ్యక్తి నుంచి వ్యక్తికి మారుతూ ఉంటుంది. ఇది భావోద్వేగాలకు సంబంధించింది. బీపీ హెచ్చుతగ్గులకు గురవుతుంది. కోపం మాత్రం ఒక ప్రతిస్పందన మాత్రమే. ఇది తాత్కాలిక భావోద్వేగం కావచ్చు. కాలక్రమేణా తగ్గవచ్చు.. పెరగవచ్చు. జీవనశైలి మార్పులు, మందులు డాక్టర్ల పర్యవేక్షణ ద్వారా బీపీని మ్యానేజ్ చేస్తారు. అటు కోపం మాత్రం మానసిక ఆరోగ్యానికి సంబంధించింది. Also READ: మనగడ్డ మీద మనమే తోపులం..మనల్ని ఓడించడం కీవీస్ తరం కాదు WATCH: #health-tips #blood-pressure #anger #health-tips-telugu #free-health-tips మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి