Health Tips: ఇవి తిన్న వెంటనే పొరపాటున కూడా నీళ్లు తాగొద్దు.. లేదంటే మీ ఆరోగ్యం పాడవుతుంది..

ప్రతిరోజూ నీరు తాగితే అది ఆరోగ్యంపై మంచి ప్రభావాన్ని చూపుతుంది. అయితే, కొన్ని పదార్థాలు తిన్న తరువాత నీరు తాగడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ అలా చేస్తే.. గ్యాస్, అసిడిటీ, జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలు తలెత్తుతాయని హెచ్చరిస్తున్నారు. అందుకే.. ఏ పదార్థాలు తిన్న తరువాత నీళ్లు తాగొద్దో తెలియాలంటే.. పైన హెడ్డింగ్ క్లిక్ చేయండి...

New Update
Health Tips :  ఈ 5 ఆహార పదార్థాలు మీకు శత్రువులు..ఎందుకో తెలుసా?

Health News: శరీరం ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండాలంటే నీరు తాగడం చాలా ముఖ్యం. రోజూ సమయానికి సరైన ఆహారం(Healthy Food) తీసుకోవడంతో పాటు.. వీలైనన్ని నీరు తాగితే ఆరోగ్యంగా ఉంటారని వైద్యులు, డైటీషియన్లు చెబుతుంటారు. మన శరీరంలోని పేరుకుపోయే వ్యర్థాలను తొలడించడంలో నీరు సహకరిస్తుంది. శరీరం డీహైడ్రేట్(Health) కాకుండా చూసుకుంటుంది. అందుకే.. రోజులో శరీరానికి సరిపడా నీళ్లు తాగాలని సూచిస్తున్నారు. అయితే, నీళ్లు తాగేటప్పుడు ఒక విషయంలో మాత్రం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. ఏం తింటున్నారు.. ఏం తాగుతున్నారు.. తిన్న వెంటనే నీరు తాగడం మంచిదేనా? వంటి కీలక విషయాలను తప్పక తెలుసుకోవాలంటున్నారు. నీరు తాగడానికి సంబంధించి డైటీషియన్స్ కీలక సూచనలిస్తున్నారు.

రోజూ 8-9 గ్లాసుల నీరు తాగాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ప్రతిరోజూ నీరు త్రాగితే అది ఆరోగ్యంపై మంచి ప్రభావాన్ని చూపుతుంది. అయితే, కొన్ని పదార్థాలు తిన్న తరువాత నీరు తాగడం క్షేమకరం కాదని నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ అలా చేస్తే.. గ్యాస్, అసిడిటీ, జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలు తలెత్తాయి. అందుకే.. ఏ పదార్థాలు తిన్న తరువాత నీళ్లు తాగొద్దో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఇదికూడా చదవండి: దసరా పండుగకు ఊరెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. మరో 9 ప్రత్యేక రైళ్లు..

అరటిపండు:

అరటిపండులో తక్షణమే కరిగిపోయే ఫైబర్ ఉంటుంది. కాబట్టి అరటిపండు తిన్న తర్వాత నీరు అస్సలు తాగకండి. లేదంటే పొట్టలో గ్యాస్, ఎసిడిటీ సమస్య ఇబ్బంది పెట్టడం మొదలవుతుంది. దీని వల్ల జీర్ణక్రియ కూడా మందగిస్తుంది. అందుకే అరటిపండు తిన్న తర్వాత పొరపాటున కూడా నీళ్లు తాగకండి.

సిట్రస్ ఫ్రూట్స్:

నారింజ పండు సిట్రస్‌ను కలిగి ఉంటుంది. ద్రాక్ష, నిమ్మకాయల్లో ఈ సిట్రస్ ఉంటుంది. ఇందులో నీరు కూడా ఉంటుంది. వీటిని తిన్న తర్వాత పొరపాటున కూడా నీళ్లు తాగొద్దు. లేకుంటే కడుపు నిండినట్లు అనిపించి.. గ్యాస్ సమస్య ఏర్పడుతుంది.

పెరుగు:

పెరుగు పాల ఉత్పత్తి. ఇది జీర్ణక్రియకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇందులో ప్రోబయోటిక్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది పేగు ఆరోగ్యానికి మేలు చేస్తుంది. పెరుగు తిన్న వెంటనే నీళ్లు తాగడం వల్ల ప్రోబయోటిక్స్ నశిస్తాయి. అందుకే పెరుగు తిన్న తరువాత కాసేపటి వరకు నీరు తాగకుండా ఉండాలి.

స్పైసీ ఫుడ్:

స్పైసీ ఫుడ్ తిన్న తర్వాత పొరపాటున కూడా నీళ్లు తాగొద్దని చెబుతున్నారు నిపుణులు. ఇది కడుపు ఉబ్బరాన్ని కలిగిస్తుంది. మసాలా ఆహారం తిన్న తర్వాత పాలు, పెరుగు తీసుకోవాలని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.

గమనిక: పైన పేర్కొన్న వివరాలను ప్రజల సాధారణ ఆరోగ్య ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని ఆర్టీవీ తెలుగు దృవీకరించడం లేదు.

ఇదికూడా చదవండి: విడాకులు తీసుకున్న కూతురికి ఘనంగా స్వాగతం తెలిపిన తండ్రి.. వీడియో వైరల్..

Advertisment
Advertisment
తాజా కథనాలు