Protein: ప్రోటీన్ లోపం వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుందా? తప్పక తెలుసుకోండి!

ప్రోటీన్ ఉంటే కాలేయ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుంది. ఇది మీలో ఫ్యాటీ లివర్ సమస్యలను కలిగిస్తుంది. ఫ్యాటీ లివర్ అనేది కాలేయంలో కొవ్వు పేరుకుపోవడం వల్ల కలిగే వ్యాధి. శరీర అభివృద్ధికి కూడా ప్రోటీన్ అవసరం. ప్రోటీన్ లేకపోవడం పిల్లల మెదడు మందగిస్తుంది.

Protein: ప్రోటీన్ లోపం వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుందా? తప్పక తెలుసుకోండి!
New Update

Protein: బాడీ ఫిట్ నెస్, మెరుగైన ఆరోగ్యం కోసం పౌష్టికాహారం తీసుకోవాల్సి ఉంటుంది. రోజూ పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా శరీరానికి అవసరమైన ప్రోటీన్‌ దక్కుతుంది. ప్రోటీన్ కండరాలను నిర్మించడానికి, బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. అనేక రకాల వ్యాధుల నుంచి రక్షించడంలోనూ ప్రోటీన్‌ పాత్ర కీలకం. అనేక శాఖాహార, మొక్కల ఆధారిత ఫుడ్‌లలో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. మీ ఆహారంలో తగినంత ప్రోటీన్ లేకపోతే మీరు కండరాల నొప్పి, బలహీనత వంటి సమస్యలకు గురవుతారు.

ఎంత ప్రోటీన్‌ కావాలి?

  • ప్రోటీన్ లోపం ఎక్కువ కాలం కొనసాగితే మంచిది కాదు. దీనివల్ల మీరు కొన్ని తీవ్రమైన వ్యాధులకు కూడా గురవుతారు. రోజుకు కిలోగ్రాము శరీర బరువుకు 0.8 గ్రాముల ప్రోటీన్ పెద్దలకు అవసరమని నిపుణులు చెబుతున్నారు. ఉదాహరణకు, 75 కిలోల బరువున్న వ్యక్తి రోజుకు 60 గ్రాముల ప్రోటీన్ తీసుకోవాలి. ప్రోటీన్ లోపం ఉన్నప్పుడు, శరీర నిర్మాణం మారడం ప్రారంభిస్తుంది. ఇది మెరుగుపడకపోతే కాలేయ వ్యాధి, బోన్‌ సమస్యలను పెంచుతుంది. కండరాలు, ఎముకలను నిర్మించడానికి, బలోపేతం చేయడానికి మాత్రమే కాదు, శరీర అభివృద్ధిని ప్రోత్సహించడానికి కూడా ప్రోటీన్ అవసరం. ప్రోటీన్ లేకపోవడం పిల్లల మెదడు అభివృద్ధిని కూడా మందగించేలా చేస్తుంది. అందుకే ఆహారంలో ప్రోటీన్‌ క్వాన్‌టిటి ఉండేలా చూసుకోండి.

అనేక రోగాలు రావొచ్చు:

  • ప్రోటీన్ లోపం రోగనిరోధక శక్తిని దెబ్బతీస్తుంది. మహిళలపై ఒక అధ్యయనం జరిపారు సైంటిస్టులు. తొమ్మిది వారాల పాటు తక్కువ ప్రోటీన్ కలిగిన ఆహారాన్ని అనుసరించడం వారి రోగనిరోధక ప్రతిస్పందనను గణనీయంగా తగ్గించిందని చూపించింది. శరీరంలో ప్రోటీన్ లేకపోవడం కాలేయ ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తుంది. ఇది మీలో ఫ్యాటీ లివర్ సమస్యలను కలిగిస్తుంది. ఫ్యాటీ లివర్ అనేది కాలేయంలో కొవ్వు పేరుకుపోవడం వల్ల కలిగే వ్యాధి. చికిత్స చేయకపోతే సిరోసిస్ లాంటి సమస్యలు రావొచ్చు. అంతేకాదు కాలేయం ఫెయిల్‌ కూడా అయ్యే ఛాన్స్‌ కూడా ఉంది.

ఇది కూడా చదవండి: టీలో చక్కెరతో పాటు ఉప్పు వేసుకుంటే ఏమవుతుంది?..ఆరోగ్యానికి మంచిదేనా?

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

#health-tips #health-benefits #diseases #protein
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe