Health Tips: చర్మం కాంతివంతంగా మెరవాలంటే.. ఈ చిట్కాలు పాటిస్తే చాలు.. చర్మం కాంతివంతంగా మెరవాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలని డెర్మటాలజిస్టు నిపుణులు చెబుతున్నారు. షుగర్, కొవ్వుతో కూడిన ఆహారం తీసుకోవద్దని అంటున్నారు. అలాగే మేకప్ అతిగా వాడకూడదని.. కాలుష్యం, అనారోగ్య అలవాట్లకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. By B Aravind 19 Nov 2023 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి చాలామంది బయటకి వెళ్లినప్పుడు తాము అందంగా కనిపించాలని కోరుకుంటారు. ముఖ్యంగా ఆడవాళ్లు మాత్రం ఈ విషయంలో అస్సలు కాంప్రమైస్ కారు. వివిధ రకాల మేకప్‌లతో టైం తీసుకోని మరీ రెడీ అయిపోయి బయటికి వెళ్తుంటారు. చర్మం మెరిసిపోయేలా కనిపించేందుకు చేయాల్సినవన్నీ చేస్తుంటారు. అయితే ఈ విషయంలో కాస్త జాగ్రత్తలు పాటించాలని నిపుణులు చెబుతున్నారు. 'వయోభారంతో సహా.. పర్యావరణ కాలుష్యం కూడా చర్మాన్ని పొడిబారేలా మార్చేస్తుంది. అలాగే షుగర్, కొవ్వులతో కూడిన ఆహారం తీసుకుంటే కూడా చర్మ సౌందర్యం కోల్పోయేలా చేస్తుంది. వాస్తవానికి వయసు పెరిగేకొద్ది చర్మంపై ముడతలు వస్తుంటాయి. అలాగే కాలుష్యం వల్ల డల్, డ్రై స్కిన్ సమస్యలు కూడా వచ్చేస్తుంటాయి. వీటితో పాటు ఒత్తిడి, జీవనశైలి, ఆందోళన వంటి సమస్యలు చర్మ సంరక్షణపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయని' చెబుతున్నారు. Also read: వరల్డ్‌కప్ హై వోల్టేజ్ మ్యాచ్‌లో వీటిని తింటే ఒత్తిడి, బీపీ అదుపులో ఉంటాయి..!! మేకప్ అతిగా వాడితే చర్మ సహజ కాంతిని కోల్పోయేలా చేస్తాయని డెర్మటాలజిస్టులు చెబుతున్నారు. అలాగే కాలుష్యం, అనారోగ్య ఆహారపు అలవాట్లు కూడా ఇందుకు కారణమవుతాయని.. చర్మ సంరక్షణ కోసం సహజ పద్దతులను పాటించి మంచి ఫలితాలు పొందవచ్చని సూచిస్తున్నారు. ' శరీరాన్ని ప్రతిరోజూ సరైన రీతిలో శుభ్రం చేసుకోవాలి. మలినాలు తొలగి మృత కణాలు పునరుద్ధరించేలా జాగ్రత్తలు తీసుకంటే మంచి ఫలితాలు కనిపిస్తాయి. నూనె పదార్థాలకు, ప్రాసెస్డ్ ఆహారం, ముఖ్యంగా స్వీట్ల వంటి తీపి పదార్థాలకు దూరంగా ఉండాలి. మాయిశ్చరైజింగ్ క్రీమ్‌ను మీ శరీరతత్వానికి అనుకూలంగా ఉండేలా ఎంచుకోవడం మంచిది. చర్మ సంరక్షణ కోసం సన్‌స్క్రీన్ లోషన్‌కు రోజూ వాడాలి. చర్మం యవ్వనంతో మెరిసేలా ఉండేందుకు ఈ జాగ్రత్తలు పాటించాలని' డెర్మటాలజిస్ట్ నిపుణులు చెబుతున్నారు. Also read: 7 గంటల కంటే తక్కువ నిద్రపోతే జరిగే పరిణామాలు ఇవే..!! జాగ్రత్త #telugu-news #health-tips #health-news మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి