High BP: హైబీపీ ఉందా ? తరచూ నొప్పి మందులు వాడుతున్నారా ? ప్రమాదంలో పడ్డట్లే హైబీపీ ఉన్నవాళ్లలో చాలామంది నొప్పి మందులను చీటికీ మాటికీ వాడుతుంటారు. ఇలా చేయడం అస్సలు మంచిది కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇలా నొప్పి మందులు తరుచుగా వాడితే ఛాతి మంట, గుండెపోటు, పక్షవాతం లాంటి దుష్ప్రభావాలు వస్తాయంటున్నారు. ఇందుకోసం వైద్యుల సలహా తీసుకోవాలని చెబుతున్నారు. By B Aravind 08 Nov 2023 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి అధిక రక్తపోటు (హైబీపీ) ఉన్నట్లు తేలితే చాలామంది చీటికీ మాటికీ నొప్పి మందులు వాడుతుంటారు. కొందరైతే వైద్యని సలహాలు, సూచనలు లేకుండానే మెడికల్ షాప్‌కు వెళ్లి మాత్రలు తెచ్చుకొని మింగేస్తుంటారు. అయితే ఇలా నొప్పి మందులతో ఛాతిమంట, కడుపు నొప్పి, జీర్ణాశయంలో పుండ్లు రావడం లాంటి రకరకాల దుష్ప్రభావాలు వస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఎవరైనా గానీ ఇలా చీటికీ మాటికీ నొప్పి మందులను వాడటం సరికాదు. ముఖ్యంగా అధిక రక్తపోటు ఉన్నవారు వీటిపట్ల జాగ్రత్తగా ఉండాలి. నొప్పి మందులు రక్తపోటును పెంచే ప్రమాదం కూడా ఉంది. హైబీపీ ఉన్నవారు రక్తపోటును నియంత్రణలో ఉంచుకోవడం చాలా ముఖ్యం. లేకపోతే పక్షవాతం, గుండెపోటు లాంటి తీవ్ర అనర్థాలకు దారితీస్తుంది. నొప్పి మందులు ఎలా పనిచేస్తాయి? వాస్తవానికి నొప్పులన్నీ మెదడులోనే ఉంటాయి. ఆయా భాగాల్లోని నాడుల నుంచి మెదడుకు వచ్చే విద్యుత్తు సంకేతాల వల్లే మనకు నొప్పి ఉన్నట్లు అనిపిస్తుంది. కానీ మొత్తం కూడా విద్యుత్తు సంకేతాల ప్రక్రియ కాదు. కణజాలం దెబ్బతినప్పుడు, మడమ బెణికినప్పుడు అక్కడి కణాలు కొన్ని రసాయనాలను విడుదల చేస్తాయి. ఆ తర్వాత వాపును ప్రేరేపించి, నాడుల నుంచి మెదడుకు ఎక్కువగా విద్యుత్తు సంకేతాలు వెళ్లేలా చేస్తాయి. దీనివల్లే నొప్పి భావనా కలుగుతుంది. కణాలు విడుదల చేసేటటువంటి రసాయనాల ప్రభావాలను నొప్పి మందులు నిరోధిస్తాయి. నొప్పి తగ్గిన భావనను కలిగిస్తాయి. కానీ ఈ మందులు నొప్పి ఉన్నచోటుకి మాత్రమే పరిమితం కావు. శరీరమంతా ప్రయాణించడంతో దీనివల్ల దుష్ప్రభావాలు కలుగుతాయి. Also Read: ఐరన్ లెవెల్స్ పెరగడానికి మార్గాలు.. ఏ ఆహారం తీసుకోవాలంటే..? హైబీపీ గలవారికి ముప్పెందుకు? కొన్ని నొప్పి మందులు కిడ్నీలకు రక్త సరఫరాను తగ్గించేలా చేస్తాయి. దీనివల్ల కిడ్నీల్లో రక్తం శుద్ధి చేసే ప్రక్రియ తగ్గిపోతుంది. దీంతో శరీరంలో ద్రవాల మోతాదు పెరిగి, రక్తపోటు అధికం అవుతుంది. మరోవైపు ఎన్‌ఎస్‌ఏఐడీ రకం నొప్పి మందులను తరచూ వేసుకుంటున్నా.. అధిక మోతాదులో తీసుకున్నా కూడా కిడ్నీలు చెడిపోయే ప్రమాదం ఉంది. అందుకే నొప్పి మందుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వైద్యుని సలహా లేకుండా ఎక్కువ రోజులు వీటిని తీసుకోవడం మంచిది కాదు. అత్యవసరమైతే డాక్టర్లు అసిటమెనోఫెన్ వంటి సురక్షితమైన మందులను సూచిస్తారు. నొప్పిని ఎలా తగ్గించుకోవాలి ? నొప్పులు, బాధలకు మందులే మాత్రమే పరిష్కారం కాదు. ఇతర ప్రత్యామ్నాయాలు కూడా ఉన్నాయి. నొప్పి నుంచి ఉపశమనం పొందేందుకు మాత్రల కన్నా ముందు కొన్ని పద్ధతులను పాటించవచ్చు. 1.ఐస్ ప్యాక్: మడమ బెణకటం వంటి గాయాలకు ఐస్ ప్యాక్ యూజ్ అవతుంది. నొప్పి ఉన్నచోట ఐస్ ముక్కలను అద్దినట్లైతే వాపు, నొప్పి తగ్గుతాయి. 2. వేడి కాపు: దీర్ఘకాలంగా ఉండే నొప్పులకు వేడి కాపు మేలు చేస్తుంది. వేడి నీటిలో తువ్వాలును ముంచి పిండి, నొప్పి ఉన్నచోట అద్దితే ప్రయోజనం ఉంటుంది. 3. వ్యాయామం: కీళ్ల నొప్పుల వంటి నొప్పులకు వ్యాయామం ఎంతో ఉపయోగపడుతుంది. ఇది కీళ్లు తేలికగా కదలటానికి సాయపడుతుంది. 4. విశ్రాంతి: యోగా, మెడిటేషన్ వంటివీ నొప్పి తగ్గటానికి దోహదపడతాయి. ముఖ్యంగా మానసిక ఒత్తిడితో వచ్చే తలనొప్పి లాంటి వాటికి ఇవి మేలు చేస్తాయి. ఇతర పద్ధతులు: ఆక్యూపంక్చర్ లాంటి ఇతర పద్ధతులతో కూడా నొప్పులను తగ్గించుకోవచ్చు. #health-tips #health-news #high-bp మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి