Tips For Free: ఆరోగ్యంగా ఉండేందుకు కొన్ని చిట్కాలు.. పాటిస్తే మంచిదేగా!

ప్రస్తుత కాలంలో చాలా మంది ఆరోగ్యంపై ద్రుష్టి పెట్టడం మానేశారు. దీనికి వారి బిజీ లైఫ్ షెడ్యూల్ కావచ్చు, లేదా సరైన అవగాహన లేకపోవడం కావచ్చు. ఏదిఏమైనా ఆరోగ్యంపై తగిన చర్యలు తీసుకోకపోతే.. అనారోగ్యంతో మన శరీరం ప్రతిచర్య చూపెడుతుంది.

New Update
Tips For Free: ఆరోగ్యంగా ఉండేందుకు కొన్ని చిట్కాలు.. పాటిస్తే మంచిదేగా!

1. సమతుల్య ఆహారం తీసుకోండి:

publive-image
పండ్లు, కూరగాయలు, చిక్కుళ్ళు, గింజలు వంటి వివిధ రకాల ఆహారాలను తినండి. ఉప్పు ఎక్కువగా వాడడం తగ్గించుకోండి. షుగర్ వాడకం కూడా తగ్గిస్తే మంచిది. ఫ్యాట్స్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోకపోవడం ఉత్తమం.

2. నీరు ఎక్కువగా తాగండి:

publive-image
రోజుకు 8 గ్లాసుల నీరు తాగాలని గుర్తుంచుకోండి. మీ శరీరం 80% నీటితో రూపొందించబడింది మరియు సాధారణ ప్రేగు పనితీరు, సరైన కండరాల పనితీరు, రోగనిరోధక, చర్మ ఆరోగ్యానికి నీరు అవసరం. తగినంత నీరు తాగకపోవడం వల్ల నిర్జలీకరణం, అలసట, తలనొప్పి, పొడి చర్మం, రోగనిరోధక శక్తి తగ్గుతోంది.

3. క్రమం తప్పకుండా వ్యాయామం:

publive-image
వారానికి కనీసం 150 నిమిషాల వ్యాయామాలు లేదా వారానికి కనీసం 5 రోజులు 30 నిమిషాల వ్యాయామం చేయడానికి ప్రయత్నించండి. వాకింగ్, జాగింగ్, స్విమ్మింగ్ లేదా ఇంట్లోనే పైలేట్స్ వర్కౌట్ చేసినా, శారీరకంగా చురుకుగా ఉంటారు. వ్యాయామం ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడానికి మీకు సహాయపడటమే కాకుండా, నిశ్చల జీవనశైలి ఫలితంగా వచ్చే వ్యాధుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.

4. నిద్ర ముఖ్యం:

publive-image

నిద్రకు రోగనిరోధక వ్యవస్థ మధ్య బలమైన లింక్ ఉంది. ఏడు నుండి తొమ్మిది గంటల నిద్రను పొందడం వలన మీరు నిద్రపోతున్నప్పుడు మీ శరీరాన్ని నయం చేస్తుంది, బలపరుస్తుంది. మీ శారీరక మరియు మానసిక ఆరోగ్యానికి మంచి నిద్ర చాలా ముఖ్యం.

5. ఆల్కహాల్ కు కొంచెం దూరంగా ఉండండి:

publive-image
మద్యానికి దూరంగా ఉంటె మంచిది. ఒకవేళ తీసుకున్న అదుపులో తీసుకుంటే అనారోగ్యం భారిన పడకుండా ఉంటారు. ఎక్కువగా మద్యానికి బానిసైతే కిడ్నీలో ఫెయిల్ అవుతాయి. మతి మెరుపు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

6. స్మోకింగ్  చేయకండి:

publive-image
ధూమపానం ఆరోగ్యానికి హానికరం అని సిగరెట్ ప్యాకెట్ల పైనే ఉంటుంది. అలాంటప్పుడు కోరి రోగాన్ని తెచ్చుకోవడం దేనికి. స్మోకింగ్ చేయడం ద్వారా ఊపిరితిత్తులు దెబ్బ తింటాయి. దీని వల్ల మీకు శ్వాసకోస సమస్యలు ఎదురుకుంటారు.

7. సూర్యకాంతి నుండి కాపాడుకోండి:

publive-image

సూర్యకిరణాలు మంచివే అలా అని రోజుమొత్తం బయటే ఉంటా అంటే మాత్రం ఆసుపత్రిలో చేరడం ఖాయం. సూర్యకిరణాల్లో వచ్చే UV రేస్ వల్ల చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందట. దీని వల్ల స్కిన్ క్యాన్సర్ వస్తుందట. బయటకు వెళ్ళేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని అంటున్నారు.

Advertisment
తాజా కథనాలు