Health Tips: పండ్ల రసాలు తాగుతున్నారా.. అయితే ఒక్క నిమిషం ఆగండి..

చాలామంది కూరగాయలు, పండ్ల రసాన్ని తీసుకుంటారు. కానీ ఇవి తీసుకునేముందు పీచు తీసెస్తారు. దీనివల్ల పీచు మధ్యలో ఉండే పాలీఫెనాల్స్, యాంటీఆక్సిడెంట్లు వంటి పోషకాలను కోల్పోతున్నామని వైద్య నిపుణులు చెబుతున్నారు.

New Update
Health Tips: పండ్ల రసాలు తాగుతున్నారా.. అయితే ఒక్క నిమిషం ఆగండి..

Fruit Juices Tips: పండ్లు, కూరగాయలు తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది. వీటిలో విటమిన్లు, ఖనిజాలు చాలా ఉంటాయి. అందుకే చాలామంది ఫ్రూట్స్, ఫ్రూట్ జూస్, కూరగయాలు (Vegetables) ఇలా విటమిన్లు ఎక్కువగా ఉండే వాటిని తీసుకుంటారు. వాస్తవానికి వీటి రసాలు తాగడం అనేది కూల్‌డ్రింకుల వంటి వాటితో పోల్చితే చాలా మంచిదే. కానీ ఇలా వాటి రసాలు తీసే క్రమంలో కీలకమైన పీచును కోల్పోతున్నామనే విషయాన్ని చాలామంది గుర్తించడం లేదు. పీచు అనేది ఆరోగ్యానికి చాలా అవసరం. కొన్ని పండ్లు, కూరగాయల్లోని పీచు మధ్యలో పాలీఫెనాల్స్ (Polyphenols), యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. అందకే ఇలా పీచును తీయడం వల్ల ఇలాంటి పోషకాలను కోల్పోతున్నామని వైద్య నిపుణులు చెబుతున్నారు.

Also Read: వామ్మో.. గుమ్మడికాయ జ్యూస్ తాగితే ఇన్ని ఆరోగ్య లాభాలా..!

అలాగే పీచు తినడం వల్ల కడుపు నిండిందనే భావన కూడా కలుగుతుంది. అందుకే త్వరగా ఆకలి వేయదు. జీర్ణక్రియ (Digestion) సక్రమంగా, సాఫీగా జరిగేందుకు, కోలెస్ట్రాల్ తగ్గడానికి, అలాగే రక్తంలో గ్లూకోజ్ స్థిరంగా ఉంచేందుకు పీచు ఎంతగానో దోహదపడుతుంది. అందుకే పండ్లలోని చక్కెర పీచుతో కలిసి ఉంటుంది. అయితే శరీరం పీచును త్వరగా జీర్ణం చేసుకోలేదు. అందుకే చక్కెరలు త్వరగా కలవవు. ఇక పీచును తొలగించినట్లైతే సహజ చక్కెరల పనితీరు మారిపోతుంది. అంతేకాదు ఇవి రక్తంలో త్వరగా కలిసిపోతాయి. అలాగే వీటి మోతాదులు కూడా త్వరగా పడిపోతాయి. అందుకే పీచును కూడా కోల్పోకుండా పండ్లు, కూరగాయలు తీసుకోవడం మంచిదని నిపుణలు చెబుతున్నారు.

Also Read: ఈ సంకేతాలు కనిపిస్తే మీ కళ్లను టెస్ట్ చేయించుకోవాల్సిందే

Advertisment
Advertisment
తాజా కథనాలు