Health Tips: ఆహారం తీసుకునేటప్పుడు ఉప్పు అదనంగా వేసుకుంటున్నారా..

ఆహారంలో ఉప్పును అదనంగా వేసుకుంటే ముధుమేహం ముప్పు పెరుగుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు. ఆహారంలో అదనంగా అసలు ఉప్పు వేసుకోని లేదా అరుదుగా వేసుకునేవారికి డయాబెటిస్ ముప్పు 13 శాతం, కొన్నిసార్లు వేసుకునేవారికి 20 శాతం, తరుచుగా వేసుకునేవారికి 39 శాతం ముప్పు అధికంగా ఉన్నట్లు తేలింది.

Health Tips: ఆహారం తీసుకునేటప్పుడు ఉప్పు అదనంగా వేసుకుంటున్నారా..
New Update

మధుమేహం.. ప్రస్తుతం రోజుల్లో అందర్ని కలవర పెడుతున్న వ్యాధి. దీని బారినపడ్డామంటే ఇక ప్రతిరోజూ మాత్రలు వేసుకోవాల్సిందే. వయసుతో సంబంధం లేకుండా చిన్నారుల నుంచి వృద్ధుల వరకు దీని ఈ డిసీజ్‌కు గురవుతుంటారు. అయితే ఈ మధుమేహం ముప్పు కారకాలు అంటే ముందుగా అధిక బరువు, ఊబకాయం, బద్ధకంతో కూడిన జీవనశైలి, కాలేయానికి కొవ్వు పట్టడం అలాగే కుటుంబంలో ఎవరికైన ఈ వ్యాధి ఉండటం లాంటివి గుర్తుకొస్తాయి. అయితే ఇప్పుడు వీటి వరుసలో ఉప్పును చేర్చాల్సిన అవసరం వచ్చింది. అమెరికాలోని టులానే యూనివర్సిటీ స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ అండ్‌ ట్రాపికల్‌ మెడిసిన్‌కు చెందిన ఓ పరిశోధకుల బృందం దీనిపైనే అధ్యయన చేశారు. ఉప్పును ఎక్కువగా వాడటం వల్ల మధుమేహం ముప్పు పెరుగుతున్నట్లు గుర్తించారు.

ఆహారం తీసుకునేటప్పుడు అదనంగా ఉప్పు అసలే వేసుకోని లేదా ఎప్పుడో ఓసారి వేసుకునేవారితో పోలిస్తే తినే ప్రతిసారీ ఉప్పు ఎక్కువగా వేసుకునేవారికి మధుమేహం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటున్నట్లు తేలింది. ఉప్పు పరిమితిని పాటిస్తే టైప్2 డయాబెటిస్‌ ముప్పును తగ్గిస్తున్నట్లు తమ అధ్యయనంలో రుజువైంది పరిశోధకులు చెబుతున్నారు. బ్రిటన్ నేషనల్ హెల్త్‌ సర్వీస్‌లో నమోదైనవారి ఆరోగ్య సమాచారంపై విశ్లేషణ జరిపారు. ఆహారంలో అదనంగా అసలు ఉప్పు వేసుకోని లేదా అరుదుగా వేసుకునేవారికి మధుమేహం ముప్పు 13 శాతం ఉండగా.. కొన్నిసార్లు వేసుకునేవారికి 20 శాతం.. ఇక తరుచుగా వేసుకునేవారికి ఏకంగా 39 శాతం మప్పు అధికంగా ఉన్నట్లు తేలింది.

Also Read: ఈ పప్పు తింటే షుగర్ మీ దరిదాపుల్లోకి కూడా రాదు!

జీవనశైలి, సామాజిక,ఆర్థిక పరిస్థితులు, ఇతర సంప్రదాయ మధుమేహ కారకాలతో అసలు సంబంధమనేదే లేకుండా ఉప్పుతో ముప్పు పెరుగుతుండటం గమనార్హం. అయితే దీనికి కారణం ఏంటి అన్నది స్పష్టంగా తెలియరాలేదు. కానీ అదనంగా ఉప్పు కలపటం వల్ల ఎక్కువెక్కువగా తినటానికి కారణమవుతుండొచ్చని పరిశోధకులు అంచనావేస్తున్నారు. దీంతో ఊబకాయం, కణ అంతర్గత వాపు ప్రక్రియ పెరిగే అవకాశాలున్నాయి. అయితే ఇవి రెండూ కూడా మధుమేహం ముప్పు కారకాలే.

#health-tips #salt #health-news
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe